విడుదలకు సిద్ధంగా 50 చిన్న బడ్జెట్‌ చిత్రాలు

Jun 1 2021 @ 17:44PM

కోలీవుడ్: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు చిత్ర పరిశ్రమ కుదేలైపోయింది. గత సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు పరిస్థితులు చక్కబడ్డాయని ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి అల్లకల్లోలం సృష్టించింది. థియేటర్లను మూసివేయగా, సినిమా షూటింగులు బంద్‌ అయ్యాయి. ఏప్రిల్‌ 9వ తేదీన హీరో ధనుష్‌ నటించిన ‘కర్ణన్‌’ చిత్రమే థియేటర్‌లో విడుదలైన చివరి చిత్రం. ఏప్రిల్‌ 11 నుంచి థియేటర్లు మూతపడేవున్నాయి. 


దీంతో అనేక చిన్నబడ్జెట్‌ చిత్రాలు షూటింగులతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి.. కానీ, కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమాలన్నీ విడుదలకు కాకుండా ఆగిపోయాయి. ముఖ్యంగా, ‘కాగిత పూక్కల్‌’, ‘ఉళైక్క కరంగళ్‌’, ‘సినిమా కణవుగళ్‌’, ‘ఇలంజోడిగల్‌’, ‘ఇది కదై అల్ల నిజం’, ‘వీరమగన్‌’, ‘ఇళవరసి’, ‘వైరి’, ‘సిల్లాట్ట’, ‘భూతమంగళం’ ‘డమ్మి జోకర్‌’, ‘ఇరవా ఇరువు’, ‘ఉత్రా’, ‘కబాలి టాక్కీస్‌’, ‘ఎల్లైక్కావలన్‌’, ‘చిన్నపన్నై పెరియ పన్నై’, ‘నెంజక్కూట్టిల్‌’, ‘వెట్రిత్తిరుమగన్‌’ తదితర 50 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కాలం ముగిసిన వెంటనే ఈ చిత్రాలు విడుదల కానున్నాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.