
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం కోసం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కోసం నిధులను మంజూరు చేసింది. నియోజక వర్గంలోని దళితులకు అందించడానికి రూ.500 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.