ఉక్రెయిన్‌లో చిత్తూరోళ్లు ఇంకా 52 మంది ఉండిపోయారు..!

ABN , First Publish Date - 2022-03-02T11:59:54+05:30 IST

ఉక్రెయిన్‌లో చిత్తూరోళ్లు ఇంకా 52 మంది ఉండిపోయారు..!

ఉక్రెయిన్‌లో చిత్తూరోళ్లు ఇంకా  52 మంది ఉండిపోయారు..!

చిత్తూరు : ఉక్రెయిన్‌ ఉడికిపోతోంది. ఏ మూలనుంచి ఏ మిసైల్‌ వచ్చిపడుతుందో తెలియదు. సాధారణ పౌరులు కూడా యుద్ధవీరుల్లా మారుతున్నారు. ఇంటికో మనిషి లెక్కన ఆర్మీ బలగాలకు సేవలందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఎప్పుడెప్పుడు స్వదేశానికి వెళ్లిపోదామా అని మన జిల్లాకు చెందిన దాదాపు 50మంది విద్యార్థులు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలామంది రుమేనియా సరిహద్దుకు చేరుకుని ఇండియాకు తీసుకొచ్చే విమానం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం  బార్డర్‌లోని చిన్న షెల్టర్లో జిల్లాకు చెందిన 12మంది విద్యార్థులున్నారు.


కాగా.. ఉక్రెయిన్‌లో మన జిల్లాకు చెందిన 52 మంది విద్యార్థులు ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతానికి గుర్తించిన వారితో ఫోన్లో మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచి రోజుకు ఒకరిద్దరు జిల్లాకు చెందిన విద్యార్థులు వివిధ మార్గాల్లో సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మరికొందరు మార్గమధ్యంలో ఉన్నారు. చాలామంది అవకాశం లేక ఉక్రెయిన్‌లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కలెక్టరేట్‌ నుంచి అధికారులు ఎవరికి కాల్‌ చేసినా.. సొంత ప్రాంతాలను తీసుకెళ్లమని వేడుకుంటున్నారు.


1. నూతలపాటి ఉమేష్‌, సుందరయ్య నగర్‌, తిరుపతి

2. సాయి సంజన, సత్యసాయి నగర్‌, తిరుపతి

3. బత్తిరెడ్డిగారి వంశీ, పిచ్చినాయుడుపల్లె, చంద్రగిరి

4. కళత్తూరు జ్ఞానేశ్వర్‌, సన్నిధి వీధి, శ్రీకాళహస్తి

5. శ్రీయపురెడ్డి పల్లవి, జనచైతన్యకాలనీ, తిరుచానూరు

6. రూపేష్‌ యాదవ్‌, తనపల్లె, తిరుచానూరు

7. మౌనిక, పాతపేట, చంద్రగిరి

8. బత్తుల కోటేశ్వరరావు, దుర్గసముద్రం, తిరుపతి రూరల్‌

9. ముత్యాల శ్రీవిష్ణు,పేరూరు, తిరుపతి రూరల్‌

10. జె.పావని, కోటకొమ్మలవీధి, తిరుపతి

11. అముదాల ఆకాష్‌, అన్నమయ్యనగర్‌, తిరుపతి

12. పల్లికొండ మౌళి, పేరూరు, తిరుపతి రూరల్‌

13. ఆవుల మునీశ్వర్‌రెడ్డి, ఎంపేడు, శ్రీకాళహస్తి

14. బత్తల ఆదిత్య వాల్మీకి, ఖాదీ కాలనీ, తిరుపతి

15. జి.వర్షిణి, సాయినగర్‌, తిరుపతి రూరల్‌

16. భవ్యశ్రీ, శివజ్యోతినగర్‌, తిరుపతి

17. వినీష రెడ్డి, శ్రీరామ్‌నగర్‌ కాలనీ, శ్రీకాళహస్తి

18. డి.రాహుల్‌, ఎంఆర్‌పల్లి, తిరుపతి

19. ఇ.పల్లవి, సాయినగర్‌ పంచాయతీ, తిరుపతి

20. బి.నవ్యశ్రీ, కొర్లగుంట, తిరుపతి

21. దాయని, దేశమ్మగుడివీధి, చంద్రగిరి

22. ఎస్‌. ప్రీతక్‌, భవానీనగర్‌, తిరుపతి

23. చక్రధర్‌రెడ్డి, పోస్టల్‌కాలనీ, తిరుపతి

24. జంధ్యం కావ్యశ్రీ, ఎంఆర్‌పల్లి, తిరుపతి

25. పి.సాయిహరీష్‌, పద్మావతిపురం, తిరుపతి

26. క్రిష్టి స్వర్ణ, నలందానగర్‌, తిరుపతి

27. సాయి చరణ్‌, ఎంసీఆర్‌ కాలనీ, తిరుపతి

28. సందీ్‌పరెడ్డి, గోవిందనగర్‌, తిరుపతి

29. సౌమ్యలక్ష్మి, బైరాగిపట్టెడ, తిరుపతి

30. ఎం.భానుప్రకాష్‌, పోస్టల్‌కాలనీ, తిరుపతి

31. ఎం.ప్రియ, గాండ్లవీధి,చంద్రగిరి

32. ఎస్‌.సాగరిక, శాంతినగర్‌, తిరుపతి

33. దిలీ్‌పకుమార్‌, శ్రీపురంకాలనీ, తిరుపతి

34. బి.ప్రేమసుధ, గోపాలవనం, శ్రీకాళహస్తి

35. ఎం.వినోద్‌కుమార్‌, రాళ్లబూదుగూరు, శాంతిపురం

36. డి.వేదవర్ధన్‌రెడ్డి, కాయలవారిపల్లె, బి.కొత్తకోట

37. కె.ప్రవీణ్‌కుమార్‌, పోతబోలు, మదనపల్లె

38. పి.జయశ్రీ, కొత్తపేటవీధి, వాల్మీకిపురం

39. ఎం.నరసింహులు, బాలయ్యగారిపల్లె, కలకడ

40. ఇట్టా శ్రీకరణ్‌, తేరువీధి, పుంగనూరు

41. పి.హంపి, వివేకానందనగర్‌, మదనపల్లె

42. ఫహీమ్‌ అక్రమ్‌, జాండ్రవీధి, రొంపిచెర్ల

43. ఎ.హర్షిణి, రాజాజీవీధి, మదనపల్లె

44. జె.హర్షిత, రాజాజీవీధి, మదనపల్లె

45. బి.చంద్రశేఖర్‌, పచ్చికాపల్లం, వెదురుకుప్పం

46. సాయి రోహిత్‌, శాంతినగర్‌, పుంగనూరు

47. జె.నవ్యశ్రీ, వివేకానందనగర్‌, మదనపల్లె

48. ఎన్‌.శరత్‌కుమార్‌, కీలపట్టు, నగరి

49. మహ్మద్‌ గౌస్‌, వినాయకనగర్‌, కలికిరి

50. ఎస్‌.దీపక్‌, షిర్డీసాయినగర్‌, పుంగనూరు

51. మహమ్మద్‌ సుహైల్‌, ఇందిరానగర్‌, మదనపల్లె

52. సాయి నిఖిత, డీసెంట్‌ కాలనీ, బి.కొత్తకోట.

Updated Date - 2022-03-02T11:59:54+05:30 IST