Hyderabad: రామేశ్వరం-సికింద్రాబాద్‌-అగర్తలకు 52 ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-07-22T12:25:31+05:30 IST

ప్రయాణికుల రద్దీ దృష్టా సికింద్రాబాద్‌-అగర్తల-సికింద్రాబాద్‌, రామేశ్వరం-సికింద్రాబాద్‌ మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు గురువారం

Hyderabad: రామేశ్వరం-సికింద్రాబాద్‌-అగర్తలకు 52 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్టా సికింద్రాబాద్‌-అగర్తల-సికింద్రాబాద్‌, రామేశ్వరం-సికింద్రాబాద్‌ మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌-అగర్తల మధ్య ఆగస్టు 15,22,29, సెప్టెంబరు 5,12,19,26 తేదీల్లో ప్రత్యేక రైలు(07030)ను నడుపుతున్నట్టు వివరించారు. అగర్తల-సికింద్రాబాద్‌  మధ్య ఆగస్టు 19,26, సెప్టెంబరు 2,9,16,23,30తేదీల్లో ప్రత్యేక రైళ్లు(07029) ఏర్పాటు చేసినట్టు  తెలిపారు.

సికింద్రాబాద్‌- రామేశ్వరం మధ్య ఆగస్టు 24,31, సెప్టెంబరు 7,14,21,28 అక్టోబర్‌ 5,12,19,26, నవంబర్‌ 2,9,16,23,30 డిసెంబర్‌ 7,14,21,28 తేదీల్లో ప్రత్యేకరైలు(07685) నడుస్తుందన్నారు. రామేశ్వరం- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేకరైలు (07686) ఆగస్టు 26, సెప్టెంబరు 2,9,16,23,30, అక్టోబర్‌ 7,14,21,28 తేదీల్లో, నవంబర్‌ 4,11,18,25, డిసెంబర్‌ 2,9,16,23,30 తేదీల్లో నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-22T12:25:31+05:30 IST