ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజ్ బెల్ట్ వద్ద భారత మహిళ.. ఆమెను ఆ స్థితిలో చూసి షాకైన అధికారులు

ABN , First Publish Date - 2022-02-09T23:44:15+05:30 IST

అగ్రరాజ్యంలోని ఎయిర్‌పోర్ట్‌లు అన్ని సాధారణంగా వచ్చిపోయే ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో అధికారులు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ నేప

ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజ్ బెల్ట్ వద్ద భారత మహిళ.. ఆమెను ఆ స్థితిలో చూసి షాకైన అధికారులు

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యంలోని ఎయిర్‌పోర్ట్‌లు అన్ని సాధారణంగా వచ్చిపోయే ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో అధికారులు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్ట్‌లోని బ్యాగేజీ బెల్ట్ వద్ద ఇండియాకు చెందిన మహిళను చూసి అధికారులు షాకయ్యారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



ఖతార్ నుంచి అమెరికాకు బయల్దేరిన 54ఏళ్ల భారత మహిళ డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న బ్యాగింగ్ బెల్ట్ వద్దకు వెళ్లిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఆమె స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలో వీల్ చైర్‌లో అపస్మారక స్థితిలో ఆమెను చూసి అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న టెక్నీషియన్లు ఆమెకు సీపీఆర్ చేశారు. తర్వాత ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అపస్మారక స్థితిలో ఆమెను చూసి తొలుత షాకైనట్టు అధికారులు తెలిపారు. కాగా.. ఆమె పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. 




Updated Date - 2022-02-09T23:44:15+05:30 IST