ఆర్‌బీకేల్లో 5,400టన్నుల ఎరువులు

ABN , First Publish Date - 2021-07-28T07:05:49+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులను అందించాలని గతంలోనే నిర్ణయించింది.

ఆర్‌బీకేల్లో 5,400టన్నుల ఎరువులు

డిజిటల్‌ చెల్లింపుల నుంచి మినహాయింపు

అగ్రి ఇన్‌పుట్స్‌ డీఎం మీరయ్య

ఒంగోలు(జడ్పీ), జూలై 27: రాష్ట్రప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులను అందించాలని గతంలోనే నిర్ణయించింది. వాటి సరఫరా బాధ్యతలను మార్క్‌ఫెడ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే రైతుల అవసరాలకు అనుగుణంగా 5,400 మెట్రిక్‌ టన్నుల ఎరువులను జిల్లావ్యాప్తంగా ఉన్న ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచినట్లు అగ్రి ఇన్‌పుట్స్‌ డీఎం మీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రబీ సీజన్‌కు సంబంధించి మిగిలిన 690 మెట్రిక్‌ టన్నులు కూడా ప్రస్తుత నిల్వల్లో కలిపామని వివరించారు. రైతులు ఇప్పటి వరకూ 837 మెట్రిక్‌ టన్నుల ఎరువులను కొనుగోలు చేశారని, కొరత ఉత్పన్నం కాకుండా సమృద్ధిగా అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. డిజిటల్‌ చెల్లింపులు మాత్రమే స్వీకరించాలని తొలుత ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆదివారం నుంచి నగదు చెల్లింపులకు కూడా అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. 




Updated Date - 2021-07-28T07:05:49+05:30 IST