హైదరాబాద్‌లో కొత్తగా 55 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

ABN , First Publish Date - 2021-02-28T16:29:13+05:30 IST

మందుబాబులను ఆకట్టుకోవడానికి హంగులతో కూడిన కొత్త బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి...

హైదరాబాద్‌లో కొత్తగా 55 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

హైదరాబాద్‌ సిటీ : నగరంలో మందుబాబులను ఆకట్టుకోవడానికి హంగులతో కూడిన కొత్త బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 280 (వాటిలో చాలా చోట్ల పబ్‌లు కూడా ఉన్నాయి) బార్లు ఉన్నాయి. తాజాగా మరో 55 బార్లకు ఎక్సైజ్‌ అధికారులు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కొత్త బార్‌, పబ్‌, రెస్టారెంట్ల లైసెన్సు నిమిత్తం 1380 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లాటరీ పద్ధతిన ఈ నెల 19న ఎంపిక చేశారు. దీంతో పబ్‌లు, బార్‌ల సంఖ్య 335కి చేరుకుంటుంది.

Updated Date - 2021-02-28T16:29:13+05:30 IST