జిల్లాకు 57 వేల డోసుల వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:11:39+05:30 IST

జిల్లాకు మరో 57 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చింది. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన వ్యాక్సిన్‌ శుక్రవారం ఉదయం పెదవాల్తేరులోని కేంద్ర స్టోరేజీకి చేరింది.

జిల్లాకు 57 వేల డోసుల వ్యాక్సిన్‌

విశాఖపట్నం, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో 57 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చింది. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన వ్యాక్సిన్‌ శుక్రవారం ఉదయం  పెదవాల్తేరులోని కేంద్ర స్టోరేజీకి చేరింది. ఇందులో 27 వేల డోసుల కొవాగ్జిన్‌ కాగా, మరో 30 వేల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉంది. ఈ మొత్తాన్ని శనివారం ఉదయం జిల్లాలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. 

రెండో డోసు వ్యాక్సినేషన్‌ కేంద్రాలివే..

జిల్లాలో పలు కేంద్రాల్లో రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పీఎస్‌ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ జిల్లాలోని ఆనందపురం, అనంతగిరి, బుచ్చయ్యపేట, చీడికాడ, చింతపల్లి, చౌడువాడ, జి.మాడుగుల, గొలుగొండ, గూడెం కొత్తవీధి, కేజేపురం, మాకవరపాలెం, మునగపాక, నాతవరం, పాయకరావుపేట, పెదబయలు, ఆర్‌ తాళ్ల వలస, రాంబిల్లి, రావికమతాం, రేవిడి, సబ్బవరం, వేములపూడి, అరకు, దేవరాపల్లి, డుంబ్రిగుడ, గవరవరం, గొడిచెర్ల, కశింకోట, కేడీ పేట, కేవీ పురం, ముంచింగపుట్టు, హుకుంపేట, పెనుగొళ్లు, పాడేరు, పరవాడ, పెందుర్తి, అనకాపల్లి పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలలో కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. అలాగే, నగర పరిధిలోని కొవిషీల్డ్‌ రెండో డోసు అల్లిపురం, బుచ్చిరాజుపాలెం, వన్‌టౌన్‌, రామ్మూర్తి పంతులుపేట, సాగర్‌నగర్‌, తగరపువలస, విద్యుత్‌నగర్‌, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్రైవర్స్‌ కాలనీలోని ద్రోణంరాజు కల్యాణ మండపం, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం ఆర్టీసీఎం, చినవాల్తేరు, సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రం, స్వర్ణభారతి, ఆరిలోవ, శ్రీహరిపురం, కింగ్‌జార్జ్‌ ఆస్పత్రి, మధురవాడ, గోపాలపట్నంలోని కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. కొవాగ్జిన్‌ రెండో డోసు చినవాల్తేరు, వన్‌టౌన్‌, అల్లిపురం, ఆరిలోవ, బుచ్చిరాజుపాలెం, గాజువాక, కేజీహెచ్‌, రామ్మూర్తిపంతులు పేట, సాగర్‌నగర్‌, ఆర్‌.తాళ్లవలస ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో లభిస్తుందన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో వ్యాక్సిన్‌ వేసేది ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌ ద్వారా గానీ సంబంధిత ఆశా కార్యకర్త ద్వారాగానీ స్లిప్‌ రూపంలో అందిస్తారని, వాళ్లు మాత్రమే వ్యాక్సినేషన్‌కు రావాలని ఆయన సూచించారు. 



Updated Date - 2021-05-15T05:11:39+05:30 IST