లోక్‌ అదాలత్‌లో 5,838 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T07:04:31+05:30 IST

జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఆదివా రం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 5,838 కేసు లు పరిష్కారమయ్యాయి.వీటిలో జిల్లా కోర్టుకు చెంది న 2,555 కేసులు ఉన్నాయి.

లోక్‌ అదాలత్‌లో 5,838 కేసుల పరిష్కారం
సూర్యాపేట లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి గౌతమ్‌పప్రసాద్‌

సూర్యాపేట లీగల్‌, హుజూర్‌నగర్‌, జూన్‌ 26: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఆదివా రం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 5,838 కేసు లు పరిష్కారమయ్యాయి.వీటిలో జిల్లా కోర్టుకు చెంది న 2,555 కేసులు ఉన్నాయి. వీటిలో 32 సివిల్‌, 789 క్రిమినల్‌, 1,713 ఎస్టీసీ, 2 క్రిమినల్‌ అప్పీల్స్‌, 19 మోటార్‌ వాహన ప్రమాద క్లైంల కేసులు పరిష్కారమయ్యాయి. లోక్‌ అదాలత్‌ నిర్వహణ బెంచీలో ప్రొ సీడింగ్‌ అధికారులుగా ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి గౌతమ్‌ప్రసాద్‌, మొదటి అదనపు జిల్లా జడ్జి ప్రే మలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.శ్రీవాణి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.సురేష్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.ప్రశాంతి వ్యవహరించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గొండ్రాల అశోక్‌, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్‌, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, జె.శశిధర్‌, మారపాక వెంకటేశ్వర్లు, ఏ.అశోక్‌, డీఎస్పీ నాగభూషణం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. హు జూర్‌నగర్‌లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 1,320 క్రిమినల్‌ కేసులు, 5 సివిల్‌ కేసులు పరిష్కారమయ్యాయి. పరిహారంగా దీంతో రూ.13,28,500 ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌మిత్ర, లోక్‌ అదాలత్‌ సభ్యులు కాల్వ శ్రీను, కొట్టు సురే ష్‌, రాఘవరావు,శ్రీనివాసరావు, సీఐ రామలింగారెడ్డి,ఎస్‌ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T07:04:31+05:30 IST