
ఏడాది చివరి నాటికి సేవలు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అతిత్వరలోనే ఈ పని పూర్తి చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్ రాజ్య సభలో ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. 5జీ స్పెక్ట్ర మ్ కనీస ధరలపై ట్రాయ్ నుంచి త్వరలోనే సిఫారసులు అందుతాయన్నారు. గత ఏడేళ్లలో దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నట్టు తెలిపారు.