భర్తను వదిలేసి వేరొకరితో వెళ్లిపోయిన మహిళ.. 6 నెలల తర్వాత తిరిగొస్తే నగ్నంగా పరుగెత్తించారు..!

Jun 16 2021 @ 17:04PM

భర్తను వదిలేసి వేరొకరితో వెళ్లిపోయిన ఓ మహిళకు గ్రామస్తులు దారుణమైన శిక్ష విధించారు. గ్రామ వీధుల్లో నగ్నంగా పరిగెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు గ్రామ పెద్దలను అరెస్ట్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దౌర్ జిల్లాలోని చెంగ్‌మార్ గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళ తన భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. 


ఆరు నెలల అనంతరం భర్త కోసం గ్రామానికి తిరిగి వచ్చింది. విషయం గ్రామ పెద్దలకు తెలిసింది. వారు ఆమెకు దారుణ శిక్ష విధించారు. బూతులు తిడుతూ ఆమె బట్టలు ఊడదీసి వీధుల్లో పరిగెత్తించారు. అనంతరం ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. శిక్ష వేసిన గ్రామ పెద్దలను అరెస్ట్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. 


 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...