అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు..!

ABN , First Publish Date - 2022-07-10T05:03:47+05:30 IST

నార్వే రాజధాని ఓస్లోలో జరగబోయే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు పాల్గొననున్నారు.

అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు..!

ఎన్నారై డెస్క్: నార్వే రాజధాని ఓస్లోలో జరగబోయే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు పాల్గొననున్నారు. జూలై 11, 12 తారీఖుల్లో జరగనున్న ఒలింపియాడ్‌లో భారత్ తరఫున ప్రాంజల్, అతుల్, అర్జున్, ఆతిత్య, వేదాంత్, కౌత్సవ్ పాల్గొంటారు. ఈమారు ఓలింపియాడ్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మంది పాల్గొననున్నారు.  ఆరుగురు సభ్యులున్న విద్యార్థి బృందాలు దేశాల వారీగా పోటీ పడతాయి. గణిత సమస్యలు పరిష్కరించి నిర్ణీత స్కోర్ సాధించిన విద్యార్థులకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. 

Updated Date - 2022-07-10T05:03:47+05:30 IST