బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

Published: Sun, 27 Mar 2022 18:25:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

బరువు తగ్గేందుకు చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా అవి సత్ఫలితాలు ఇవ్వక.. ప్రైవేట్ ఆస్పత్తుల్లోలక్షలు ఖర్చు చేసి సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలమీదికి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సహజసిద్ధ పద్ధతుల ద్వారా బరువు తగ్గితే.. భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. సాధారణంగా అంతా రోజు వారీ ఆహారంలో బియ్యం తీసుకోవడం చూస్తుంటాం. అయితే చాలామంది పాలిష్ పట్టిన బియ్యాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుందని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 6రకాల బియ్యం తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో, వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

బ్రౌన్ రైస్

బరువు తగ్గించడంలో బ్రౌన్ రైస్ కీలక పాత్ర పోషిస్తాయట. ఇందులో తక్కువ కేలరీలు.. ఎక్కువ ఫైబర్లతో పాటూ మెగ్నీషియం, పాస్పరస్, థయామిన్, నియాసిన్, విటమిన్ B6 వంటివి ఉండడంతో శరీరంలో కొవ్వును పెరగకుండా నియంత్రిస్తాయి. జీవక్రియను పెంచడంలో ఇవి బాగా సహాయపడతాయట. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌‌లో 21 శాతం మెగ్నీషియం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వైట్‌ రైస్‌కు బదులుగా బ్రౌన్‌ రైస్ తీసుకుంటే మంచిది. గుండెపోటు, చక్కెర వ్యాధికి కారణమయ్యే మెటబాలిక్ సిండ్రోమ్‌ను బ్రౌన్ రైస్ నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

ఎర్ర బియ్యం

బ్రౌన్ రైస్ లాగానే, రెడ్ రైస్ కూడా చాలా తక్కువగా పాలిష్ చేయబడి ఉంటుంది. ఇందులో మాంగనీస్‌, పైబర్ సమృద్ధిగా ఉంటుంది. కప్పు బియ్యంలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ రోజుకు 8గ్రాముల పైబర్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎర్ర బియ్యంలో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి అద్భుతంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఈ బియ్యం తినేవారికి  మల బద్ధకం సమస్యే ఉండదట. డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు కూడా దరి చేరవట. ఈ బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

నల్ల బియ్యం

నల్ల బియ్యంలో విటమిన్ బి, ఇ, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇవి కూడా పాలిష్, ప్రాసెస్ చేయని బియ్యం కాబట్టి బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్యాలను దూరం చేస్తుంది. బ్లాక్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాలేయంలో ఉండే హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడగాయి. వీటిలో కనిపించే ఆంథోసైనిన్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. 100 గ్రాముల నల్ల బియ్యంలో 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందు వల్ల జీర్ణక్రియ మెరుగుపడడానికి దోహదపడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

దంపుడు బియ్యం

దంపుడు బియ్యంలో కూడా తక్కువ పాలిషింగ్, ప్రాసెసింగ్‌ ఉండడం వల్ల బియ్యం యొక్క బయటి పొరలు, పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. అలాగే ఇందులో చాలా పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆకలి త్వరగా వేయదు. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి దంపుడు బియ్యం మంచి ఆహారం. అలాగే ఈ బియ్యం చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఎముకలను బలంగా ఉండేందుకు శరీరం క్యాల్షియం గ్రహించేలా ఈ బియ్యం తోడ్పడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

వెదురు బియ్యం

ఈ బియ్యాన్ని ములయారి బియ్యం అని కూడా పిలుస్తారు. చనిపోతున్న వెదురు రెమ్మ నుంచి ఈ బియ్యాన్ని తీస్తారు. ఇందువల్ల ఈ బియ్యం చాలా ప్రత్యేకమైనవి. గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల.. బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా పని చేస్తుంది. అలాగే ఈ వెదురు బియ్యంలో విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కీళ్ల నొప్పులను నయం చేయడంలోనూ బాగా తోడ్పడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..

కాలీఫ్లవర్ బియ్యం

కాలీఫ్లవర్ రైస్‌లో కేలరీలు తక్కువగా ఉండడంతో పాటూ ఫైబర్ అధికంగా ఉంటుంది, బరువు తగ్గాలనుకునే వారికి ఈ బియ్యం కూడా బాగా తోడ్పడతాయి. ఇది విటమిన్ ఎ, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది, ఈ బియ్యం శరీరంలోని ఫ్రీ రాడికల్ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో బాగా పని చేస్తుంది. 1 కప్పు కాలీఫ్లవర్‌ అన్నంలో కేవలం 27 కేలరీలు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అందు వల్ల బరువు తగ్గడంలో ఈ బియ్యం బాగా తోడ్పడతాయి.

పైన పేర్కొన్న అన్ని రకాల బియ్యం.. బరువు తగ్గడానికి ఉపయోగపడడంతో పాటూ ఆరోగ్యకరంగా ఉండేలా సహాయపడతాయి. అయితే ఏ బియ్యాన్ని అయినా నిర్ధిష్ట పద్ధతిలో వండడం ద్వారా బియ్యంలోని కేలరీలను మరింత తగ్గించవచ్చని.. శ్రీలంక కొలంబోలోని కాలేజ్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఒక కప్పు బియ్యాన్ని ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో కలిపి 40 నిమిషాల పాటు ఉడికించి, తర్వాత 12 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బియ్యంలోని క్యాలరీలు తగ్గుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.