తండ్రితో డీల్ కుదుర్చుకున్న 6ఏళ్ల బాలుడు.. రూ.100 కోసం ఏడు రోజులపాటు..!

ABN , First Publish Date - 2022-02-03T21:33:04+05:30 IST

ఆ చిన్నోడికి ఇపుడు ఆరేళ్లు. కానీ.. రూ.100 కోసం తండ్రితో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. 7 రోజులపాటు ఒప్పందంలో పేర్కొన్న విధంగా నడుచుకుంటానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆ అగ్రిమెంట్

తండ్రితో డీల్ కుదుర్చుకున్న 6ఏళ్ల బాలుడు.. రూ.100 కోసం ఏడు రోజులపాటు..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నోడికి ఇపుడు ఆరేళ్లు. కానీ.. రూ.100 కోసం తండ్రితో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. 7 రోజులపాటు ఒప్పందంలో పేర్కొన్న విధంగా నడుచుకుంటానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆ అగ్రిమెంట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సాధారణంగా చిన్నపిల్లలు కుదురుగా ఉండరు. అల్లరి చేస్తూ.. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ.. చేతికందిన దాన్ని విసిరేస్తూ ఇంట్లో హంగామా చేస్తుంటారు. ఎంత చెప్పినా వినిపించుకోరు. పోనీ బెదిరిస్తే అయినా దారికొస్తారా? అంటే అదీ కుదరదు. ఈ క్రమంలోనే తన ఆరేళ్ల కొడుకును కంట్రోల్ చేసేందుకు ఓ తండ్రి రకరకాల ప్రయోగాలు చేశాడు. అవేవీ సక్సెస్ కాలేదు. దీంతో ఒక అగ్రిమెంట్‌తో తన కొడుకు ముందుకు వెళ్లాడు. ఉదయం ఏ టైంకు నిద్రలేవాలి.. రోజంతా ఏం చేయాలి.. మళ్లీ రాత్రి ఎపుడు పడుకోవాలి వంటి అన్ని విషయాలకు ఓ టైం టేబుల్ రూపొందించాడు. ఏడవకుండా, అరవకుండా, ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ప్రతి రోజూ ఆ టైం టేబుల్‌ను పాటిస్తే.. రోజుకు రూ.10 ఇస్తానని పేర్కొన్నాడు. ఇలా వారం రోజులపాటు చేస్తే బోనస్‌తో కలిపి రూ.100 ఇస్తానని పేర్కొంటూ అగ్రిమెంట్లో‌ పేర్కొన్నాడు. 



అనంతరం తన కొడుకు అబీర్ దగ్గరకు వెళ్లి విషయం వివరించాడు. ఓకే అనుకుంటే సంతకం చేయాలని సూచించాడు. అయితే డబ్బులపై ప్రేమతో ఆ కుర్రాడు.. అగ్రిమెంట్‌పై సంతకం చేసేశాడు. దీంతో ఆ తండ్రి ఎగిరి గంతేశాడు. తనతో తన కొడుకు కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన పేపర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఐడియా ఏదో బాగుంది’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఆరేళ్ల వయసు కుర్రాడి అగ్రిమెంట్‌లోని విషయాలు అర్థమయ్యాయా?’ అని ప్రశ్నిస్తున్నారు.



Updated Date - 2022-02-03T21:33:04+05:30 IST