
- ట్రాఫిక్ సమస్య తీర్చండి CI సార్..
చిత్తూరు జిల్లా/ పలమనేరు : పలమనేరు పట్టణం పెద్ద మసీదు వీధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటూ ఓ ఆరేళ్ల బాలుడు సీఐ భాస్కర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. తాను చదువుకుంటున్న పాఠశాల ఉన్న పెద్దమసీదు వీధిలో ఓ భవనాన్ని కూల్చి వేశారని, ఆ శిథిలాలను తొలగించేందుకు వీధిలో ట్రాక్టర్లు అడ్డదిడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని కార్తికేయ అనే బాలుడు పలమనేరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐని కలిసి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీఐ వెంటనే ఎస్ఐ నాగరాజును పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భయపడకుండా పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన కార్తికేయకు స్వీట్ తెప్పించి ఇచ్చి అభినందించారు. దీన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి