గర్భిణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ ఆస్పత్రికి రూ.60 లక్షల Fine

ABN , First Publish Date - 2022-06-29T16:06:04+05:30 IST

ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. రోగి కుటుంబానికి రూ.60 లక్షల పరిహారం చెల్లించాలని..

గర్భిణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ ఆస్పత్రికి రూ.60 లక్షల Fine

Hyderabad : ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం(Consumer Forum) జరిమానా విధించింది. రోగి కుటుంబానికి రూ.60 లక్షల పరిహారం చెల్లించాలని ఆసుపత్రికి వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది. 2019లో హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక గర్భిణీకి డాక్టర్ల నిర్లక్షంతో బిడ్డ అంగవైకల్యంతో పుట్టింది. 2019లో ఫిబ్రవరి 14న శిరీష హాస్పిటల్‌లో చేరింది. వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15న అత్యవసరంగా వైద్యులు సిజరిన్ చేశారు. నార్మల్ డెలివరీకి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రసవ సమయంలో డాక్టర్ల తప్పిదం కారణంగా అంగవైకల్యంతో శిశువు జన్మించింది. డాక్టర్లు అందించిన వైద్యం, మెడికల్ రిపోర్ట్‌లతో కోర్టును బాధితురాలు ఆశ్రయించింది. వైద్యుల నిర్లక్ష్యం ఉందని కోర్టు తెలిపింది. ఇదే అంశంపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-06-29T16:06:04+05:30 IST