600 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-05-11T04:48:18+05:30 IST

కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద లంబసింగి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయిని, వ్యాన్‌తో పాటు ఒక కారు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కిర్లంపూడి ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు.

600 కిలోల గంజాయి పట్టివేత

కిర్లంపూడి, మే 10: కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద లంబసింగి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయిని, వ్యాన్‌తో పాటు ఒక కారు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కిర్లంపూడి ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు. పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ మురళీమోహన్‌, ఇన్‌చార్జి సీఐ విజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు కృష్ణవరం టోల్‌గేట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా రాజమహేంద్రవరం వైపు వెళ్లే వ్యానులో తరలిస్తున్న 600 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.30 లక్షలు ఉంటుందన్నారు. రూ.50వేల నగదు స్వాధీనపరుచుకున్నామన్నారు. పెద్దాపురం ఇన్‌చార్జి సీఐ జయకుమార్‌ నిందితులు శివకృష్ణ కడియం, మద్రాసి రవికుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. తహశీల్దార్‌ సత్యనారాయణరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T04:48:18+05:30 IST