రూ.62 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. రెండు కార్లలో 418 కేజీలు..

ABN , First Publish Date - 2020-08-07T19:54:52+05:30 IST

భద్రాచలంలో గురువారం రెండు కార్లలో తరలిస్తున్న 418కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణ ఎస్‌ఐ మహేష్‌ సిబ్బందితో కలిసి

రూ.62 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. రెండు కార్లలో 418 కేజీలు..

రెండు నెలల్లో రూ.2కోట్ల గంజాయి స్వాధీనం: భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ చంద్ర 


భద్రాచలం(ఆంధ్రజ్యోతి): భద్రాచలంలో గురువారం రెండు కార్లలో తరలిస్తున్న 418కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణ ఎస్‌ఐ మహేష్‌ సిబ్బందితో కలిసి గురువారం ఫారెస్ట్‌ చెక్క్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ29 టీవీ1856, ఏపీ28 బీడీ1111 అనే నంబర్లుగల కార్లలో ఒడిశాలోని మల్కనగిరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న సుమారు 418కేజీల గంజాయిని గుర్తించారు. దాంతో కార్లతో పాటు నారాయణఖేడ్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన రాథోడ్‌ ప్రేమ్‌, చవాన్‌ రమేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ చంద్ర వివరాలను తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.62.73 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 


గడచిన రెండు నెలల కాలంలో భద్రాచలం పట్టణ పోలీసులు 14గంజాయి కేసులను నమోదు చేసి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2కోట్ల విలువైన  గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలో 24గంటలు చెక్‌పోస్టు పెట్టి ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయడం ద్వారా, గంజాయి ఇతర నిషేధిత సామగ్రి రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. గంజాయి తరలిస్తున్నటు సమాచారం తెలిస్తే పట్టణ ప్రజలు సైతం  పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ కోరారు. కార్యక్రమంలో సీఐ వినోద్‌, సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ సుందరం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T19:54:52+05:30 IST