65 ఏళ్లు పైబడితే హజ్‌ యాత్రకు అనర్హులు

ABN , First Publish Date - 2022-04-14T15:03:39+05:30 IST

సౌదీ అరేబియా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల కారణంగా హజ్‌

65 ఏళ్లు పైబడితే హజ్‌ యాత్రకు అనర్హులు

                               - ప్రభుత్వ ప్రకటన


అడయార్‌(చెన్నై): సౌదీ అరేబియా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల కారణంగా హజ్‌ ప్రయాణికులకు స్వల్ప ఆటంకాలు ఉత్పన్నంకానున్నాయి. ముఖ్యంగా 65 యేళ్ళు పైబడిన వారు హజ్‌ యాత్రకు అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బీసీ, ఎంబీసీ, మైనార్టీ సంక్షేమ మంత్రి త్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి యేటా జరిగినట్టుగానే ఈ యేడాది కూడా హజ్‌ యాత్ర కొనసాగనుంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. సౌదీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ గుర్తింపు పొంది, ప్రయాణానికి 72 గంటల ముందు జరిపిన కొవిడ్‌ పరీక్షా రిపోర్టును సమర్పించాలన్న నిబంధన విధించింది. అదేవిధంగా హజ్‌ యాత్రకు వెళ్ళదలచిన వారు ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2022-04-14T15:03:39+05:30 IST