అతడికి 65.. ఆమెకు 60 ఏళ్లు..40 ఏళ్లుగా సహజీవనం.. మనవళ్ల సమక్షంలో పెళ్లి..!

Jun 21 2021 @ 20:25PM

అతడి వయసు 65 సంవత్సరాలు.. ఆమె వయసు 60 ఏళ్లు.. ఇద్దరూ కలిసి 40 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు.. పిల్లల్ని కన్నారు.. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు అయిపోయారు.. ఇప్పుడు, ఈ వయసులో పెద్ద వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఎందుకో తెలుసా.. మరణం తర్వాత స్వర్గం ప్రాప్తించడానికట. 


ఉత్తరప్రదేశ్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి, 60 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకోకుండానే 40 ఏళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లు కూడా వచ్చేశారు. అయితే పెళ్లి చేసుకోకుండా చనిపోతే మోక్షం లభించదనే కారణంతో ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు. వారి పిల్లలు, మనవలు, మనమవరాళ్లు ఈ పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా జరిపించారు. 40 ఏళ్లు కలిసి జీవించిన వారిద్దరూ ఈ వివాహం తర్వాత అధికారికంగా భార్యాభర్తలుగా మారారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...