
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ ఎక్కడ.. ఎవరిపై.. ఎపుడు పుడుతుందో చెప్పలేం అని ఎందరో కవులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 67ఏళ్ల బామ్మ, 28ఏళ్ల యువకుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రేమలో పడ్డ ఈ ఇద్దరూ.. తమకు వయసు జస్ట్ నంబర్ మాత్రమే అంటున్నారు. అంతేకాకుండా.. ప్రేమించుకుంటున్నాం కానీ.. పెళ్లి మాత్రం చెసుకోబోం అని తేల్చి చెబుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌కు చెందిన 67ఏళ్ల రాంకాలి.. 28ఏళ్ల భోలు ఇద్దరికీ కొన్నళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోబోమని తేల్చి చెబుతున్నారు. కొద్ది రోజులుగా తామిద్దరం సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు. పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఇలాగే ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు ఇరువురూ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సహజీవనాన్ని ధ్రువీకరించుకునేందుకు.. గ్వాలియర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి