చెరువులకు జలకళ

ABN , First Publish Date - 2021-07-25T06:06:11+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో కొన్ని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి.

చెరువులకు జలకళ
వరద నీటితో నిండుకుండను గన్నారం, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతు

పూర్తిస్థాయిలో నిండి.. అలుగులు పారుతున్న జిల్లాలోని 671 చెరువులు
త్వరలోనే నిండనున్న జిల్లాలోని అన్ని చెరువులు
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు
ఈ యేడు దొడ్డురకం వరి సాగుకే మొగ్గుచూపుతున్న జిల్లా రైతులు

నిజామాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో కొన్ని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జి ల్లాలోని ప్రధాన జలాశయమైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో పాటు చెరువులు, కుంటలు నిండడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. దొడ్డురకం వరి సాగువైపు ఎ క్కువ మంది రైతులు మొగ్గుచూపుతున్నారు. అలాగే, భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతల్లో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వాని కి పంపించినా పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు అన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు.
అలుగులు పారిన 671 చెరువులు
జిల్లాలో వరుసగా నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వాగులు పొంగాయి. చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయి. జిల్లాలో మొత్తం 968 చెరువులు ఉండగా.. 671 చెరువులు నిండి అలుగులు పారాయి. మిగతా చెరువులన్నింటిలోకి 75శాతానికి పైగా నీళ్లు చేరా యి. ఇప్పటికీ చెరువులకు వరద వస్తుండడంతో ఒకటి రెం డు రోజుల్లో మొత్తం చెరువులు నిండనున్నాయి. బోధన్‌ డి విజన్‌ పరిధిలో 174 చెరువులు ఉండగా.. 163 చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 304 చెరువులు ఉండగా.. 133 చెరువులు నిండా యి. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 203 చెరువులు ఉండగా.. 95 చెరువులు నిండాయి. బాల్కొండ ప్రాంతంలో 287 చె రువులు ఉండగా.. 280 చెరువులు నిండాయి. చెరువులు పూర్తిస్థాయిలో నిండడంతో భూగర్భజల మట్టాలు కూడా భారీగా పెరిగాయి. అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా నిర్మించిన చెక్‌డ్యాంలు కూడా నిండి ప్రవహిస్తున్నా యి. గోదావరి, మంజీరా నదుల నుంచి భారీ వరద రావడ ంతో ఎస్సారెస్పీ నిండింది. రామడుగు ప్రాజెక్టుకు కూడా వ రద చేరుతోంది.
పంటల సాగులో రైతులు బిజీబిజీ
జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువుల్లోకి వరద నీరు భారీగా రావడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యాయి. ఎక్కువమంది రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కొద్దిమొత్తంలో ఆరుతడి పంటలైన సోయా, మొక్కజొన్న, పసుపుపంటలను సాగుచేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో మొత్తం 5లక్షల 7వేల 800ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధి కారులు అంచనా వేయగా.. ఇప్పటి వరకు 3లక్షల 43వేల 370 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటికే వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం వానాకాలంలో 3 లక్షల 82వేల 800ల ఎకరాల్లో వరి సాగవుతుందని  వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా.. ఇప్పటి వరకు 2లక్షల 44వేల 824 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. గత సంవత్సరం పరిస్థితులను దృష్టిలో పెట్టుకు ని ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాల వైపే మొగ్గుచూపుతున్నారు. గత సంవత్సరం సన్న రకాలకు ధర వస్తుందని ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేయగా.. ప్రభు త్వం సన్నాలకు ధర పెంచకపోవడంతో ఎ క్కువ మంది రైతులు ఓవైపు దిగుబడిరాక, మరోవైపు ధర రాక తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం గతానికి భిన్నంగా దొడ్డురకాలనే ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. ఏ గ్రేడ్‌ దొడ్డు రకానికి ఎక్కువ ధర వస్తుండడంతో రైతులు వీటి సాగుకే మొగ్గుచూ పుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో సాగయ్యే మొత్తం పంటల విస్తీర్ణంలో 70శాతానికి పైగా దొడ్డు రకాలనే సాగు చేస్తున్నారు. ఈ అంశాన్ని వ్యవసా య శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-25T06:06:11+05:30 IST