జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-02-28T05:29:01+05:30 IST

జిల్లాలో కొత్తగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 678 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు నిర్వహించగా ఏడుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది

జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

మెదక్‌ అర్బన్‌/నర్సాపూర్‌/చిల్‌పచెడ్‌, ఫిబ్రవరి 27 : జిల్లాలో కొత్తగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 678 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు నిర్వహించగా ఏడుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. వీరిలో నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో 18 మందికి నిర్వహించిన కొవిడ్‌ టెస్టుల్లో పట్టణానికి చెందిన నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆసుపత్రి సూపరిండెంట్‌ మిర్జాబేగ్‌ తెలిపారు. శనివారం ఒకే రోజు నలుగురికి సోకడంతో నర్సాపూర్‌ పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని చండూర్‌ పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో శనివారం పాఠశాలలోని 110 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి వెంకటస్వామి తెలిపారు. మెదక్‌ సబ్‌జైల్‌లో అర్బన్‌ పీహెచ్‌సీ వైద్యులు మణికంఠ ఆధ్వర్యంలో 25 మంది ఖైదీలకు, 10 మంది జైలు సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్‌ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-02-28T05:29:01+05:30 IST