7 జిల్లాల్లోనే Covid ప్రభావం.. 11 జిల్లాల్లో కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-12-10T16:40:32+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ ప్రభావం ఏడు జిల్లాల్లో అధికంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెలువరించిన బులెటిన్‌ ప్రకారం 373మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 11 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో

7 జిల్లాల్లోనే Covid ప్రభావం.. 11 జిల్లాల్లో కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ ప్రభావం ఏడు జిల్లాల్లో అధికంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెలువరించిన బులెటిన్‌ ప్రకారం 373మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 11 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 211, శివమొగ్గలో 30, కొడగులో 21 నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో 10-20మధ్యన, 12 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. 292 మంది కోలుకోగా నలుగురు మృతి చెందారు. వీరంతా బెంగళూరుకు చెందినవారే. మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. 30జిల్లాల్లో 7,332మంది చికిత్సలు పొందుతున్నారు.  

Updated Date - 2021-12-10T16:40:32+05:30 IST