ఏడుగురు ఇండిగో పైలెట్లు విమానాలు నడుపుతూ చేసిన నిర్వాకం ఇది

ABN , First Publish Date - 2022-04-28T22:35:19+05:30 IST

న్యూఢిల్లీ : ఇండిగోకు చెందిన ఏడుగురు పైలెట్లు తమ తక్కువ జీతాలపై మాట్లాడుకునేందుకు ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే అధిక పౌన:పుణ్యాన్ని వాడారు.

ఏడుగురు ఇండిగో పైలెట్లు విమానాలు నడుపుతూ చేసిన నిర్వాకం ఇది

న్యూఢిల్లీ : ఇండిగోకు చెందిన ఏడుగురు పైలెట్లు తమ తమ విమానాలను నడుపుతూ తక్కువ జీతాలపై మాట్లాడుకునేందుకు ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే అధిక పౌన:పుణ్యాన్ని వాడారు. తమ సంభాషణలో భాగంగా నేరపూరిత బాష మాట్లాడారని డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 19న పైలెట్లు తమ విమానాల నుంచి సంభాషణ జరిపారు. 121.5 మెగా హెడ్జ్ పౌన:పుణ్యాన్ని వినియోగించారని, విమానాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్థాయి ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభమైంది. అయితే ఈ పరిణామంపై ఇండిగో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదని డీజీసీఏ పేర్కొంది.


ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే 121.5 మెగాహెడ్జ్ పౌన:పుణ్యంపై ఖచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల పర్యవేక్షణ ఉంటుంది. అయితే పైలెట్లు 123.45 ఫ్రీక్వెన్సీని కూడా ఉపయోగించారు. దీనిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పర్యవేక్షించలేదని సమాచారం. కాగా ఈ ఉదంతానికి కొన్ని రోజుల ముందు.. కొవిడ్ మహమ్మారి సమయంలో జీతాల కోతలపై ఏప్రిల్ 5న నిరసన చేపట్టాలని కొందరు పైలెట్లు భావిస్తున్నారని తెలిసి వారిని సస్పెండ్ చేసింది. కాగా కరోనా సంక్షోభ సమయంలో పైలెట్స్ జీతాలను 30 శాతం వరకు జీతాలను ఇండిగో కట్ చేసింది. మరోవైపు పైలెట్ల జీతాలను 8 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్టు ఏప్రిల్ 1న ఇండిగో ప్రకటించింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్వీసులు కొనసాగితే నవంబర్‌లో మరోసారి 6.5 శాతం వరకు పెంపు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-28T22:35:19+05:30 IST