7 మామిడి కాయలు, 6 శునకాలు, నలుగురు కాపలాదారులు

ABN , First Publish Date - 2021-06-18T00:53:05+05:30 IST

జబల్‌పూర్‌లోని సంకల్ప్ పరిహార్, రాణి దంపతులు పడుతున్న తిప్పలు ఇవి. రైల్లో వెళ్తుండగా పరిహార్‌కి ఓ వ్యక్తి మామిడి మొక్కలు ఇచ్చాడు. అవి మియాజాకి అని తనకు తెలియకుండానే సాగు చేశాడట పరిహార్. అయితే కొద్ది రోజులకు అవి అరుదైన జాతి అని తెలిసింది. వారితో పాటు ఊళ్లో వాళ్లకి కూడా తెలిసింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది

7 మామిడి కాయలు, 6 శునకాలు, నలుగురు కాపలాదారులు

భోపాల్: మామూలుగా మామిడి తోట విస్తీర్ణాన్ని బట్టి కాపాలదాడులు ఉంటారు. ఒకటి నుంచి ఐదు ఏకరాల లోపు మామిడి తోటల్లో ఒకరు లేదా ఇద్దరు కాపలాదరులు మాత్రమే ఉంటారు. అందులో వేలు దాటి లక్షల్లో మామిడి కాయలు ఉంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న రెండు మామిడి చెట్లకు ఆరు శునకాలు, నలుగురు కాపలాదార్లు ఉన్నారు. ఇంతకీ ఆ చెట్లకు ఉన్న కాయలు కూడా ఏడే. కేవలం ఏడు పండ్లకే ఇంత సెక్యూరిటీ ఏంటని మీకు ఈ పాటికే అనుమానం వచ్చి ఉంటుంది. మీ అనుమానం నిజమే. అవి మామూలు మామిడి కాయలు కాదు. అమ్మితే కిలో 2.70 లక్షల రూపాయలకు పోతాయట. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన మియాజాకి జాతికి చెందిన మామిడి కాయలు అవి. అందుకే అంత సెక్యూరిటీ.


జబల్‌పూర్‌లోని సంకల్ప్ పరిహార్, రాణి దంపతులు పడుతున్న తిప్పలు ఇవి. రైల్లో వెళ్తుండగా పరిహార్‌కి ఓ వ్యక్తి మామిడి మొక్కలు ఇచ్చాడు. అవి మియాజాకి అని తనకు తెలియకుండానే సాగు చేశాడట పరిహార్. అయితే కొద్ది రోజులకు అవి అరుదైన జాతి అని తెలిసింది. వారితో పాటు ఊళ్లో వాళ్లకి కూడా తెలిసింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఖరీదైన పళ్లని దొంగలు పెరిగారట. రెండు చెట్లకు కాసిన కాయల్ని మొత్తానికి మొత్తం కోసేయగా కేవలం 7 కాయలు మిగిలాయట. వాటినైనా కాపాడుకుందామని హై లెవెల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు పరిహార్ పేర్కొన్నారు. ఉన్న ఈ కాయలతో మరిన్ని చెట్లను సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T00:53:05+05:30 IST