స్మశానంలో శవాల దుస్తులు దోచుకొని.. అమ్ముకుంటున్న దుండగులు!

May 10 2021 @ 05:19AM

లక్నో: స్మశానాల్లో మృతదేహాల దుస్తులు దొంగలించి వేరే కంపెనీ ట్రేడ్‌మార్క్ వేసి అమ్ముతున్న కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా స్మశానాల్లో దూరి అక్కడ ఉన్న దుస్తులను తీసుకొచ్చి, ఒక దుకాణ దారుడికి అప్పగించేవారు. సదరు దుకాణదారుడు ఆ వస్త్రాలకు కంపెనీ ట్రేడ్‌మార్క్ తగిలించి అమ్మేయడం ప్రారంభించాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించి దుకాణదారుడు సహా ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు బాఘ్‌పత్ ప్రాంతంలో గడిచిన పదేళ్లుగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వీరి నుంచి 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 140 చొక్కాలు, 34 ధోతీలు, 112 ట్రేడ్‌మార్క్ స్టిక్కర్లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.