Manipur landslide: ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2022-06-30T21:13:51+05:30 IST

ఏడుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపిన పోలీసులు.. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తప్పిపోయిన వారిని గుర్తించే క్రమంలో మృతుల సంఖ్య పెరగొచ్చని అన్నారు..

Manipur landslide: ఏడుగురు మృతి

ఇంఫాల్: మణిపూర్‌లో భారీ ఎత్తున కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనలో మరో 23 మంది అదృశ్యమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. నోని జిల్లాలోని ముఖుం ప్రాంతాంలో ఉన్న తుపుల్ యార్డ్ రైల్వే కన్‌స్ట్రక్షన్ క్యాంపుకు సమీపంలోని కొండ చరియలు విరిగిపడటంతో ఈ ఘటన జరిగిందని.. తమెంగ్లోంగ్, నోని జిల్లాల గుండా ప్రవహించే ఇజై నదిపై నిర్మించిన డ్యామ్ నిల్వ విపరీతంగా పెరిగిందని, ఈ నిల్వ ప్రతికూల ప్రభావం చూపితే నోని జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు మునిగి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానిక డిప్యూటీ కమిషనర్ గురువారం తెలిపారు.


ఏడుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపిన పోలీసులు.. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తప్పిపోయిన వారిని గుర్తించే క్రమంలో మృతుల సంఖ్య పెరగొచ్చని అన్నారు. కాగా, నోని ప్రాంతంలోని పరిస్థితిపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం స్వయంగా ఆయనే నోని జిల్లాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Updated Date - 2022-06-30T21:13:51+05:30 IST