ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 71మంది

ABN , First Publish Date - 2021-02-27T05:43:52+05:30 IST

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 71మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు భూక్యా కోట్య, సామల శశిధర్‌, బెల్గమ్‌ నాగరాజు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 71మంది

మూడు నామినేషన్ల ఉపసంహరణ

పట్టభద్ర ఓటర్లు 5,05,565మంది

మార్చి 14న ఎన్నిక, 17న కౌంటింగ్‌

సాగర్‌ ఉప ఎన్నికకు నేడో, రేపో నోటిఫికేషన్‌


నల్లగొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 71మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ  చివరి రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు భూక్యా కోట్య, సామల శశిధర్‌, బెల్గమ్‌ నాగరాజు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీకి సిద్ధమైన వారిసంఖ్య 71గా తేలింది. ఈనెల 16వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అనంతరం 23వ తేదీవరకు నామినేషన్లను స్వీకరించారు. మొత్తం 76మంది అభ్యర్థులు 123సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్ర్కూట్నీలో ముంద్ర మల్లికార్జున్‌రావు(టీడీపీ), బత్తుల శ్రవణ్‌కుమార్‌ (దళిత బహుజ నపార్టీ) నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మార్చి 14వతేదీన ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌, 17వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 5,05,565మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 3,32,634మంది పురుషులు, 1,72,864 మంది మహిళలు, 67మంది ఇతరులు ఉన్నారు.


ఎన్నికకు చకచకా ఏర్పాట్లు

ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. బ్యాలెట్‌ పేపర్‌లో ప్రతి అభ్యర్థికి కనీసంగా నాలుగు సెంటీమీటర్ల స్థలం కేటాయిస్తారు. దీని ప్రకారం ఈ ఎన్నికలో బ్యాలెట్‌ చిన్నపాటి సినిమా పోస్టర్‌ సైజులో ఉండనుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం జనవరి 18న ప్రకటించింది. దాని ప్రకారం 12 జిల్లాలో 4,91,396 మంది ఓటర్లు ఉండగా. సాధారణ ఎన్నికల మాదిరిగానే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకి 10రోజుల ముందు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో మరో 14,169 మందికి ఓటు హక్కు పొందారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 5,05,565 మందికి చేరగా, తుది జాబితా ఖరారైంది. ఎన్నిక నిర్వహణకు 12 జిల్లాల్లో 731 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెట్‌ పేపర్‌ ఖరారు, ముద్రణలో అధికారులు తలమునకలై ఉన్నారు.


ఏప్రిల్‌ 6న సాగర్‌ ఉప ఎన్నిక?

నాగార్జునసాగర్‌, తిరుపతి ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. వీటికి త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఏప్రిల్‌ 6న ఈ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో సాగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,16,983 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మరో 3,500 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత నామినేషన్ల దాఖలు నాటి వరకు ఓటర్‌ నమోదు చేసుకునే అవకాశం ఉంది.


బరిలో నిలిచింది వీరే..

1.పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), 2.సభావత్‌ రాములునాయక్‌(కాంగ్రె ్‌స), 3.బొమ్మనపల్లి జయసారఽఽధిరెడ్డి(సీపీఐ),4. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), 5.గోగుల రాణీరుద్రమ (యువతెలంగాణ పార్టీ), 6.ముద్దసాని కోదండరాంరెడ్డి(తెలంగాణ జనసమితి), 7.డా. చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటిపార్టీ), 8.నల్లమోతు తిరుమలరావు(ఆమ్‌ఆద్మీపార్టీ), 9.కాసాని శ్రీనివాసరావు(జై స్వరాజ్‌), 10.జూపూడి నాగార్జునరావు(తెలంగాణ ప్రజాపార్టీ), 11.వింజపూరి రాఽధాకృష్ణ (నేషనల్‌ యువతెలంగాణ పార్టీ), 12.కొర్లకంటి ప్రకా్‌షరావు(యువతరం పార్టీ), 13.గూడూరు యశోధర(తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి), 14.నజీరుద్దీన్‌ మహమ్మద్‌ (బహుజన ముక్తి పార్టీ), 15.మేడి రమణ (శ్రమజీవి), 16.బండారు నాగరాజు, 17.లింగిడి వెంకటేశ్వర్లు, 18. గుంటూరు వెంకటనారాయణ, 19. మార్త శ్రీనివాస్‌, 20.పూస శ్రీనివాస్‌, 21.మాదగోని బాల నాగసైదులు, 22.షేక్‌ షబ్బీర్‌ అలీ, 23.బొల్గూరి కిరణ్‌, 24.యార్ల ఆశాజ్యోతి, 25.సురేష్‌ కొడియాల, 26. గాలెంక విజయ్‌కుమార్‌,  27.తీన్మార్‌ మల్లన్న, 28. గడ్డం సదానందం, 29. మారం వెంకట్‌రెడ్డి,  30.సూరెడ్డి రమణారెడ్డి, 31.గుగులోతు రాజునాయక్‌,  32.దుర్గాల వెంకటేశ్వర్లు, 33.నందిపాటి జానయ్య, 34.గుండు సంజీవు లు, 35.ఎ.నరేందర్‌, 36.గుత్తా రవీందర్‌రెడ్డి, 37.ముదుడ్ల రమేష్‌,  38.మండపూడి శివప్రసాద్‌, 39.పెంట రమేష్‌, 40.సంకెపల్లి శ్రీనివా్‌సరెడి,్డ 41.కొండా రాధాకృష్ణ, 42.మామిడి అంబేద్కర్‌, 43.గద్దల అప్పారావు, 44.సూదగాని హరిశంకర్‌గౌడ్‌, 45.భారతి కూరాకుల, 46.కౌతం రవీందర్‌, 47.పాటి రవీందర్‌, 48. కామెరవి, 49.బరిగెల దుర్గాప్రసాద్‌ మహరాజ్‌, 50.డా.కొల్లు నరసింహారావు, 51.అంబాల రవికుమార్‌, 52.ఆంగోతు వీరన్న, 53.చొల్లేటి వెంకట కృష్ణాచారి, 54. జట్టి జైస్వామి, 55.తెల్గమల్ల యాదయ్య, 56.కొండ ఏడుకొండ, 57.చిల్కు శ్రీనివాస్‌, 58.గోనె నరేష్‌, 59.నర్సింగ్‌ శ్రీను, 60.అంతటి శీనయ్య, 61.వనం శ్రీకృష్ణ, 62.సపావత్‌ సుమన్‌, 63.పెరుమాళ్ళ అశోక్‌రావు, 64.గుండు ఉపేందర్‌, 65.డివేలాద్రి 66.వెంకటరమణ ముళ్లపూడి, 67.శీలం రవీందర్‌రెడ్డి, 68.జంపన్న కొండ, 69.దేశబోయిన బాలస్వామి, 70.తాళ్లూరి సృజన్‌కుమార్‌,  71.దూడపాల సంజీవ   

Updated Date - 2021-02-27T05:43:52+05:30 IST