ఐఓసీఎల్‌కు 7.26 ఎకరాలు

ABN , First Publish Date - 2021-07-22T06:16:27+05:30 IST

చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)కు 7.26ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ ఐఓసీఎల్‌ టెర్మినల్‌ ఏర్పాటు పనులు గత ఏడాదిలోనే ప్రారంభమయ్యాయి. ఈ సంస్థకు కావాల్సిన స్థలాన్ని మల్కాపూర్‌లోని సర్వేనెంబర్‌ 120లోని 7.26 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు పంపింది.

ఐఓసీఎల్‌కు 7.26 ఎకరాలు

మార్కెట్‌ ధర రూ.30లక్షలుగా నిర్ణయం

ఉత్వర్వులు జారీచేసిన ప్రభుత్వం 


యాదాద్రి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)కు 7.26ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ ఐఓసీఎల్‌ టెర్మినల్‌ ఏర్పాటు పనులు గత ఏడాదిలోనే ప్రారంభమయ్యాయి. ఈ సంస్థకు కావాల్సిన స్థలాన్ని మల్కాపూర్‌లోని సర్వేనెంబర్‌ 120లోని 7.26 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు ఐఓసీఎల్‌కు ఎకరాకు రూ.30లక్షల చొప్పున మార్కెట్‌ విలువ నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. జాతీయ రహదారికి సమీపంలోనే 69 ఎకరాల్లో రూ.611కోట్ల వ్యయంతో టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం, వాహనాలన్నింటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నగరానికి చేరువలో ఉన్న దండుమల్కాపూర్‌ ప్రాంతంలో నూతనంగా ఐఓసీఎల్‌ టెర్మినల్‌ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇంధనాన్ని సకాలంలో అందించాలన్న లక్ష్యంతో నగర శివారు ప్రాంతంలో టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మల్కాపూర్‌ సమీపంలోనే ఔటర్‌రింగ్‌రోడ్డు ఉండటంతో జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానం సులువుగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందని సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. 


పూర్తయిన ప్రజాభిప్రాయ సేకరణ

ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. పర్యావరణ అనుమతులు కూడా రావడంతో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులు వేగవంతంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఐఓసీఎల్‌ సంస్థకు కావాల్సిన భూమిని కేటాయించడంతో పను లు మరింత వేగంగా చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. టెర్మినల్‌లో 1.80లక్షల కిలోలీటర్ల ఇంధనాన్ని నిల్వ చేయనున్నారు. ఈ టెర్మినల్‌ద్వారా రాష్ట్రంలోని పెట్రోల్‌ బంకులకు నిత్యం వెయ్యి ట్యాంకర్ల ఇంధనాన్ని సరఫరాచేయనున్నారు. మల్కాపూర్‌ టెర్మినల్‌కు ఒడిశా రాష్ట్రం పారదాదీప్‌ నుంచి పైపులైన్‌ నిర్మిస్తున్నారు. రూ.3800కోట్ల పెట్టుబడితో 12,122 కిలో మీటర్ల మేర పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పారదాదీప్‌ నుంచి వైజాగ్‌, రాజమండ్రి, విజయవాడ మీదుగా పైపులైన్‌ మల్కాపూర్‌ టెర్మినల్‌కు చేరుకుంటుంది. టెర్మినల్‌ ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 

Updated Date - 2021-07-22T06:16:27+05:30 IST