73 అడుగులకు చేరిన ‘మేట్టూరు’ నీటిమట్టం

Sep 22 2021 @ 10:50AM

ప్యారీస్‌(చెన్నై): సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలో  ఉన్న డ్యాం నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. డ్యాంలో చేరే నీటి శాతం సెకనుకు 10,277 ఘనపుటడుగుల నుంచి 10,053 ఘనపుటడుగులకు తగ్గిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటలకు డ్యాం నీటిమట్టం 73.07 అడుగులకు పెరిగిందని, కావేరి డెల్టా సాగు కోసం డ్యాం నుంచి సెకనుకు 7 వేల ఘనపుటడుగుల నీటిని, అదే విధంగా తూర్పు, పశ్చిమ కాలువ సాగుకు సెకనుకు 800 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ డ్యాం నుంచి కావేరి డెల్టాలోని వ్యవసాయ భూములకు విడుదల చేసే నీటి శాతం కంటే డ్యాంలో చేరుతున్న నీటిశాతం అధికంగా వుందని, సేలం జిల్లా, పరిసర జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోందని, ప్రస్తుతం డ్యాంలో 35.39 టీఎంసీల నీటినిల్వలున్నాయని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.