7.4 కేజీల గంజాయి స్వాధీనం: వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-01-22T05:51:17+05:30 IST

కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి 7.4 కేజీల గంజాయిని చిలమత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ ఇనచార్జ్‌ డీఎ్‌సపీ మహబూబ్‌బాష పేర్కొన్నారు.

7.4 కేజీల గంజాయి స్వాధీనం: వ్యక్తి అరెస్ట్‌

పెనుకొండ టౌన, జనవరి 21 : కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి 7.4 కేజీల గంజాయిని చిలమత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ ఇనచార్జ్‌ డీఎ్‌సపీ మహబూబ్‌బాష పేర్కొన్నారు. గురువారం దీనికి సంబంధించిన వివరాలను స్థానిక కార్యాలయంలో వెల్లడించారు. హిందూపురం రూరల్‌ సీఐ ధరణికిషోర్‌, చిలమత్తూరు ఎస్‌ఐ రంగడు వారి సిబ్బందితో కొడికొండ చెక్‌పోస్టువద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు వైపునుండి బస్సులో వచ్చి కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఓ వ్యక్తి పెద్ద సంచితో దిగి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడన్నారు. దీంతో పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. అతన్ని పట్టుకుని పోలీ్‌సస్టేషనకు తరలించి విచారించారు. అతనిపేరు మహబూబ్‌ నౌమాన ఉమర్‌ అని సోమందేపల్లి మండల కేంద్రంలో వివాహం చేసుకుని అక్కడే నివా సముంటున్నాడు. గంజాయిని మహారాష్ట్ర, పూనే, బెల్గాం, పెనుకొండ హిందూపురం పారిశ్రామికవాడలో అమ్ముకుంటుంటాడని దర్యాప్తులో తేలిందన్నారు. దీనివిలువ దాదాపు రూ.50వేలు ఉం టుందన్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. 


Updated Date - 2021-01-22T05:51:17+05:30 IST