ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం లోకల్‌

ABN , First Publish Date - 2020-07-07T07:42:11+05:30 IST

ప్రైవేటు రంగంలోని 75శాతం ఉద్యోగాలను రాష్ట్ర యువతకే కేటాయించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు హరియాణా కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపిం...

ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం లోకల్‌

  • హరియాణా సర్కారు నిర్ణయం
  • రూ.50వేలలోపు ఉద్యోగాలకు నివాస ధ్రువీకరణ తప్పనిసరి
  • యూపీ, బిహార్‌కి చెక్‌ చెప్పేందుకే 

చండీగఢ్‌, జూలై 6: ప్రైవేటు రంగంలోని 75శాతం ఉద్యోగాలను రాష్ట్ర యువతకే కేటాయించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు హరియాణా కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో రాష్ట్ర యువతకు 75శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ ఎన్నికల ముందు జననాయక్‌ జనతా పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా హామీ ఇచ్చారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు ఇప్పుడు దానికి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో ఉద్యోగం పొందాలంటే అభ్యర్థులకు శాశ్వత నివాస (డొమిసిల్‌) ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. రూ.50 వేలలోపు వేతనం వచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల అభ్యర్థులు పెద్దఎత్తున ఉద్యోగావకాశాల కోసం ఇక్కడికి తరలి రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో రాష్ట్ర యువతకే సింహభాగం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Updated Date - 2020-07-07T07:42:11+05:30 IST