గ్రేటర్‌లోని కేంద్ర ప్రభుత్వ భవనాలకు 75% Tax

ABN , First Publish Date - 2021-12-16T17:14:03+05:30 IST

గ్రేటర్‌లోని కేంద్ర ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను 75 శాతం మాత్రమే వసూలు చేయాలని...

గ్రేటర్‌లోని కేంద్ర ప్రభుత్వ భవనాలకు 75% Tax

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లోని కేంద్ర ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను 75 శాతం మాత్రమే వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. బుధవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. బకాయిలతో కలిపి కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల కార్యాలయ భవనాల నుంచి సుమారు రూ.300 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. 100 శాతం పన్ను చెల్లించాలని బల్దియా సూచించగా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 75 శాతమే చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై కొన్నాళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన సర్కారు.. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ 75 శాతం పన్ను మాత్రమే వసూలు చేయాలని స్పష్టతనిచ్చింది.

Updated Date - 2021-12-16T17:14:03+05:30 IST