Viral News: భర్తకు 75ఏళ్లు.. భార్యకు 70ఏళ్లు.. పెళ్లైన 54ఏళ్లకు అమ్మానాన్నలైన వృద్ధదంపతులు!

ABN , First Publish Date - 2022-08-13T01:10:19+05:30 IST

వృద్ధ దంపతుల చిరకాల కోరిక ఎట్టకేలకు సాకారమైంది. పెళ్లైన 54ఏళ్లకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ దంపతుల ఆనందానికి అవధల్లేకుండా పోయాయి. లేటు వయ

Viral News: భర్తకు 75ఏళ్లు.. భార్యకు 70ఏళ్లు.. పెళ్లైన 54ఏళ్లకు అమ్మానాన్నలైన వృద్ధదంపతులు!

ఇంటర్నెట్ డెస్క్: వృద్ధ దంపతుల చిరకాల కోరిక ఎట్టకేలకు సాకారమైంది. పెళ్లైన 54ఏళ్లకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ దంపతుల ఆనందానికి అవధల్లేకుండా పోయాయి. లేటు వయసులో అయినా సరే.. ‘అమ్మానాన్న’ అని పిలిపించుకునే భాగ్యం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


గోపీచంద్‌(Gopichand) వయస్సు ప్రస్తుతం 75ఏళ్లు కాగా.. ఆయన భార్య చంద్రావతి దేవి(Chandravati Devi) వయస్సు 70ఏళ్లు. రాజస్థాన్‌లో(Rajasthan)ని అల్వార్ ‌ప్రాంతానికి చెందిన ఈ దంపతులు.. సరిగ్గా 54ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత అమ్మానాన్నలు(Parents)గా మారి.. ఆ అనుభూతిని ఆస్వాధించాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారికి ఆ అవకాశం అంత త్వరగా లభించలేదు. ఇందుకోసం ఆ దంపతులు 54ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం రోజు ఆ భార్యభర్తల ఏళ్లనాటి కల ఎట్టకేలకు సాకారం అయింది. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చిన చంద్రావతి దేవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 



ఈ సందర్భంగా ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ పంకజ్ గుప్తా మాట్లాడారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. చంద్రావతి దేవికి పుట్టిన బాబు సుమారు 3.5కేజీల బరువు ఉన్నట్టు చెప్పారు. ఇంతకు ముందు రెండు సార్లు.. ఇదే పద్ధతిలో గర్భం దాల్చినట్టు తెలిపారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆమెకు గర్భస్రావం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మాట్లాడుతూ.. లేటు వయసులో అయినా తండ్రైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. బంధువుల ద్వారా ఐవీఎఫ్(IVF) విధానం గురించి తెలుసుకుని వైద్యుడిని సంప్రదించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. కొద్ది కాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ఓ వృద్ధ దంపతులు కూడా ఈ విధానంలో తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-08-13T01:10:19+05:30 IST