ఒలింపిక్ విజేతలు... నవయువతకు ఆదర్శం: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-08-15T14:22:49+05:30 IST

దేశవ్యాప్తంగా ఈరోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఒలింపిక్ విజేతలు... నవయువతకు ఆదర్శం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని, అలాగే దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు వందనాలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారిపై ఫ్రంట్‌లైన్ వర్కర్ల పోరాటం అసమానమని అన్నారు. 


ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారని, వారు కేవలం పతకాలు మాత్రమే సాధించలేదని, నవయువతకు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందని, 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో మరణాలు తక్కువేనని, మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయన్నారు. కరోనా కట్టడికి క్రమశిక్షణతో కృషిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం అందరూ తీసుకోవాలని అన్నారు. 

Updated Date - 2021-08-15T14:22:49+05:30 IST