America: వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 75వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T15:44:55+05:30 IST

75వ భారత స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల(75th independence day celebrations) సందర్భంగా వాషింగ్టన్ డీసీలో(Washington Dc) గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు

America: వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 75వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎన్నారై డెస్క్: 75వ భారత స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల(75th independence day celebrations) సందర్భంగా వాషింగ్టన్ డీసీలో(Washington Dc) గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు(GWTPS President) సాయి సుధ పాలడుగు అధ్యక్షత వహించారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత జెండాలను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌(Azadi Ka Amrit Mahotsav)ను పురస్కరించుకుని అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 


పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆజాదీ కా అమృతోత్సవాలను వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయం. అమెరికాలో ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్నారు. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు’ అన్నారు. అనంతరం సాయి సుధ మాట్లాడుతూ.. ‘భారతీయులందరూ ఎక్కడ ఉన్నా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా, పండుగలాగా జరుపుకుంటారు. అమెరికాలో తొలుత ఏర్పాటు చేసిన తెలుగు సంఘం జీడబ్ల్యూటీసీఎస్’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థకు నేను అధ్యక్షురాలు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కరోనా లాంటి మహమ్మారిని సైతం లెక్కచేయకుండా మా పాలకమండలి అనేక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది’ అన్నారు. 



సతీష్ వేమన మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న తెలుగువారు అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన పాలక మండలిని నా అభినందనలు తెలియజేస్తున్నా’ అని అన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా జాతి గౌరవాన్ని పెంపొందించారు. తెలుగుభాష తియ్యందనాన్ని, తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు’ అని వ్యాఖ్యానించారు. భాను మాగులూరి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అన్షుల్ శర్మ కౌన్సెలర్ ఇండియన్ ఎంబసీ, సత్యనారాయణ మన్నె, చంద్ర మల్లావతు, కృష్ణ లాం, రవి అడుసుమల్లి, రాజేష్ కాసరనేని, ఫణి తాళ్లూరు, శ్రీనివాస్ గంగా, యాష్ బద్దులూరి, సుశాంత్ మన్నె, సుష్మ అమృతలూరు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T15:44:55+05:30 IST