Expatriate teachers: కువైత్ కీలక ప్రకటన.. ప్రవాస టీచర్లకు సర్వీస్ బెనిఫిట్స్‌ కోసం భారీగా నిధులు

ABN , First Publish Date - 2022-08-03T16:48:01+05:30 IST

ప్రవాస ఉపాధ్యాయులకు (Expatriate teachers) సంబంధించి కువైత్ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది.

Expatriate teachers: కువైత్ కీలక ప్రకటన.. ప్రవాస టీచర్లకు సర్వీస్ బెనిఫిట్స్‌ కోసం భారీగా నిధులు

కువైత్ సిటీ: ప్రవాస ఉపాధ్యాయులకు (Expatriate teachers) సంబంధించి కువైత్ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యామంత్రిత్వ శాఖ (Ministry of Education)లోని ప్రవాస ఉపాధ్యాయులకు 78 మిలియన్ దినార్లు (సుమారు రూ. 2వేల కోట్లు) సర్వీస్ ముగింపు ప్రయోజనాల కింద చెల్లించనున్నట్లు సివిల్ సర్వీస్ బ్యూరో (Civil Service Bureau) వెల్లడించింది. రాజీనామాలు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బడ్జెట్‌ను సర్దుబాటు చేస్తామని సర్వీస్ బ్యూరో తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా మంత్రిత్వశాఖలో తగ్గించాల్సిన ఉద్యోగాల సంఖ్యను సివిల్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయించలేదని పేర్కొంది. అయితే, విద్యాశాఖలో కొత్త ఉద్యోగాలను చేర్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం కువైత్ ఉపాధ్యాయులు 72.5% (63,955)గా ఉంటే.. ప్రవాస టీచర్లు 27.5శాతంగా(24,393) ఉన్నారని వెల్లడించింది.  

Updated Date - 2022-08-03T16:48:01+05:30 IST