సామాన్య శాస్త్రం పరీక్షకు 7,915 మంది హాజరు

ABN , First Publish Date - 2022-05-28T05:10:14+05:30 IST

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగం గా శుక్రవారం నిర్వహించిన సామాన్యశాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 7,915 మంది విద్యార్థులు హాజరయ్యా రు

సామాన్య శాస్త్రం పరీక్షకు 7,915 మంది హాజరు
అనంతపురం జడ్పీ హైస్కూల్‌ పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు

- ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

గద్వాలటౌన్‌/ వడ్డేపల్లి/ ఉండవల్లి/ ధరూరు/ అయిజ, మే 27 : పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగం గా శుక్రవారం నిర్వహించిన సామాన్యశాస్త్రం  పరీక్షకు  జిల్లా వ్యాప్తంగా 7,915 మంది విద్యార్థులు హాజరయ్యారు.  జిల్లాలోని 41 కేంద్రాల్లో 8,015 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 7915 (98.75 శాతం) మంది హాజరుకాగా, 100 మంది గైర్హాజరయ్యారు. గద్వాల పట్టణంలోని ఏడు, మండల పరిధిలోని అనంతపురంతో కలిపి ఎనిమిది కేంద్రాల్లో 2,055 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 2,037 మంది హాజరయ్యారు. 18 మంది గైర్హాజరయ్యారు.


- వడ్డేపల్లి మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లో శుక్రవారం పదవ తరగతి పరీక్ష సజావుగా సాగింది. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాఘవేంద్ర స్కూలులో 260 మందికి, 255 మంది పరీక్ష రాశారు. అయిదుగురు గైర్హాజరయ్యారు. రవీంద్ర పాఠశాలలో 170 మంది విద్యార్థులకు గాను, 166 మంది పరీక్ష రాశారు. నలు గురు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఎంఈవో నర్సింహ పరిశీలించారు.


- ఉండవల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 170 మంది విద్యార్థులకు గాను, ఒకరు గైర్హాజరయ్యారు. మైనారిటీ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలో 163 విద్యార్థులకు గాను ముగ్గురు పరీక్ష రాయలేదు. ప్రాథ మిక పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో 145 మంది పరీక్ష రాసినట్లు ముఖ్య పర్యవేక్షకులు నిర్మలాజ్యోతి, అమరేం దర్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ జగన్‌మోహన్‌ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.


- ధరూరు మండల పరిధిలోని ఉప్పేరు, మార్లబీడు, ధరూరు పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ధరూరులో 286 మంది విద్యార్థులకుగాను 283 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. ఉప్పేరు పాఠశాలలో 288 మంది విద్యార్థులకు గాను 283 మంది హాజరయ్యారు. మార్లబీడులో 186 మందికి గాను 184 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఎంఈవో సురేష్‌ పరిశీలించారు. 


- అయిజ తహసీల్దార్‌ యాదగిరి శుక్రవారం పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మండల పరిధిలోని ఆరు పరీక్ష కేంద్రాల్లో 990 మంది విద్యార్థులు పరీక్ష రాయల్సి ఉండగా, 971 మంది రాశారు. 19 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2022-05-28T05:10:14+05:30 IST