7 చదరపు మీటర్ల ఫ్లాట్.. కిచెన్ కూడా లేదు.. ధర ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-19T03:02:25+05:30 IST

అది లండన్‌లోనే అత్యంత చిన్న ఫ్లాట్. దాని విస్త్రీర్ణం జస్ట్ 7 చదరపు మీటర్లే. అటువంటి ఫ్లాట్ ‌ప్రస్తుతం వేలానికి వచ్చింది. వంటగది కూడా లేని ఆ ఫ్లాట్ కసీన ధర 50 వేల పౌండ్లు(సుమారు రూ. 50 లక్షలు)గా నిర్ణయించారు.

7  చదరపు మీటర్ల ఫ్లాట్.. కిచెన్ కూడా లేదు.. ధర ఎంతో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్:  అది లండన్‌లోనే అత్యంత చిన్న ఫ్లాట్. దాని విస్త్రీర్ణం జస్ట్ 7 చదరపు మీటర్లే. అటువంటి ఫ్లాట్ ‌ప్రస్తుతం వేలానికి వచ్చింది. వంటగది కూడా లేని ఆ ఫ్లాట్ కసీన ధర 50 వేల పౌండ్లు(సుమారు రూ. 50 లక్షలు)గా నిర్ణయించారు. ఫిబ్రవరి 22 న వేలం పాట ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. లోవర్ క్లాప్టాన్‌లోని సరటోగా వీధిలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంట్లో కిచెన్ లేకపోయినప్పటికీ.. బెడ్, టాయిలెట్, షవర్, సామాన్లు కడిగేందుకు ఓ సింక్, మైక్రోవేవ్ ఓవెన్ పెట్టుకునేందుకు, కొద్ది మొత్తంలో సామాన్లు పెట్టుకునేందుకు స్థలం ఉంది. మరి ఇలాంటి ఫ్లాట్‌కు డిమాండ్ ఏమేరకు వస్తుందో వేచి చూడాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-02-19T03:02:25+05:30 IST