సికింద్రాబాద్‌లో TSEWA 7వ వార్షిక సమావేశం.. పలువురు విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేత

ABN , First Publish Date - 2022-06-27T00:03:13+05:30 IST

త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం(TSEWA) 7వ వార్షిక సాధారణ సమావేశం ఆదివారం జరిగింది.

సికింద్రాబాద్‌లో TSEWA 7వ వార్షిక సమావేశం.. పలువురు విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేత

సికింద్రాబాద్ : త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం(TSEWA) 7వ వార్షిక సాధారణ సమావేశం ఆదివారం జరిగింది. సికింద్రాబాద్‌లోని  ఏడబ్ల్యూహెచ్‌వో(Army Welfare Housing Organisation) వద్ద వేద్విహార్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రెసిడెంట్(ఎక్స్‌అఫిషియో) కమాండర్(రిటైర్డ్) సుధీర్ పరకాల మాట్లాడారు. TSEWA ఏడేళ్ల స్వల్పకాలంలోనే అఖిల భారత ఈఎస్ఎం(ESM) ఆర్గనైజేషన్‌గా అవతరించిందన్నారు. ఈ సంస్థలో భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, 6 ఇతర దేశాల్లో మాజీ సైనికులు, కుటుంబాలు, యుద్ధంలో భర్తను కోల్పోయిన స్త్రీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. కొవిడ్/ఒమిక్రాన్ కారణంగా కాలేజీ ఫీజులు కూడా చెల్లించలేక పేదరిక రేఖ దిగువన ఉన్న విద్యార్థులకు సహాయం అందించామని వివరించారు.  పెన్షన్‌కు అర్హతలేని అత్యవసరంలో ఉన్న వెటరన్స్(మాజీ సైనికులు), వితంతువులు, పౌరులకు ఈ ఏడేళ్లలో రూ.46 లక్షలకు పైగా ఆర్థిక సహకారం అందించామని సుధీర్ పరకాల వెల్లడించారు. ఈ సందర్భంగా సభ్యులందరికీ, ముఖ్యఅతిథిగా హాజరైన కల్నల్ జనరల్ అగర్వాల్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ సందర్భంగా మేజర్ జనరల్ శిబ్‌నాథ్ ముఖర్జీ(ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్) చారిటీ తరపున మోనికా మల్లేష్ విద్యార్థినికి (ఎంబీబీఎస్ చదవడానికి)కి రూ.65 వేల చెక్కుని అందజేశారు. కే అనిల్(బీఎస్‌సీ ఫైనల్), జీ  గౌతమి(బీకామ్ ఫైనల్ ఇయర్) విద్యార్థులకు టీఎస్‌ఈడబ్ల్యూఏకి చెందిన మాధురి సేవా ఫండ్ తరపున చెక్కులను అందజేశారు. ఇక కల్నల్ పార్వతీశం, జనరల్ సెక్రటరీ వార్షిక నివేదికను వెల్లడించారు. కల్నల్ విజయ్ సాలిన్స్(బడ్జెట్ అండ్ బ్యాలెన్స్ షీట్స్), కల్నల్ సీతారామయ్య(చారిటీ డివిజన్ చైర్మన్) ఆర్థిక సహాయాల వివరాలను వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి టీఎస్‌ఈడబ్ల్యూఏ చీఫ్ మెంటార్  బ్రిగేడియర్ సీఎస్ విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. కమాండర్ చంద్రశేఖర్ సభ్యులకు స్వాగతం పలికగా.. గౌరవ కెప్టెన్ ఎంఎన్ రెడ్డి ముగింపు  ప్రసంగం చేశారు. ఈ మేరకు టీఎస్ ఇండియన్ నేవీ కమాండర్(రిటైర్డ్) సుధీర్ పరకాల వివరాలను తెలిపారు.

Updated Date - 2022-06-27T00:03:13+05:30 IST