Zomato Delivery Boy: ఏడేళ్ల వయసుకే జోమాటో డెలివరీ బాయ్‌గా మారిన కుర్రాడు.. రాత్రి 11 గంటల వరకు ఉద్యోగం.. ఆ బాలుడి కన్నీటి గాథ వింటే..

ABN , First Publish Date - 2022-08-04T00:14:37+05:30 IST

ఏడేళ్లంటే ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసు. ఏ చీకూ చింతా లేకుండా నవ్వుతూ తుళ్లుతూ తిరగాల్సిన వయసు..

Zomato Delivery Boy: ఏడేళ్ల వయసుకే జోమాటో డెలివరీ బాయ్‌గా మారిన కుర్రాడు.. రాత్రి 11 గంటల వరకు ఉద్యోగం.. ఆ బాలుడి కన్నీటి గాథ వింటే..

ఏడేళ్లంటే ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసు. ఏ చీకూ చింతా లేకుండా నవ్వుతూ తుళ్లుతూ తిరగాల్సిన వయసు.. కానీ, అంత చిన్న వయసులోనే ఓ కుర్రాడు కొండంత బాధ్యతను భుజాల మీద వేసుకున్నాడు.. కుటుంబంలో జరిగిన ఓ విషాదం ఆ బాలుడి బాల్యాన్ని చిదిమేసింది.. ఓ ప్రమాదంలో తండ్రి గాయాలపాలవడంతో ఏడేళ్ల వయసులోనే ఆ బాలుడు కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు.. ఉదయం స్కూలుకు వెళ్లి చదువుకుని, సాయంత్రం తర్వాత డెలివరీ బాయ్‌గా (7-Year-Old Zomato Delivery Boy) మారుతున్నాడు.. రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేస్తున్నాడు.. ఆ బాలుడి కథ సోషల్ మీడియాలో వైరల్ (Viral News) అయింది. 


ఇది కూడా చదవండి..

Bihar: మరిదితో లవ్ అఫైర్.. భర్తను అడ్డు తప్పించేందుకు ఆమె ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసిందంటే..


రాహుల్ మిట్టల్ అనే వ్యక్తి ట్విటర్‌లో ఆ బాలుడి కథను షేర్ చేశాడు. ఆ ట్వీట్ ప్రకారం.. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. పేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ కోసం అతని ఏడేళ్ల కొడుకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఉంటాడు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 11 గంటల వరకు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సైకిల్‌పై వెళ్తూ అందరికీ డెలివరీలు అందజేస్తున్నాడు. 


తన తండ్రి ప్రొఫైల్‌కు యాప్‌ ద్వారా బుకింగ్‌లు వస్తాయని, వాటిని తాను డెలివరీ చేస్తుంటానని ఆ వీడియోలో పిల్లవాడు చెప్పాడు. సైకిల్‌పై వెళ్లి ఆర్డర్‌లు అందజేస్తానని తెలియజేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ధైర్యంగా బాధ్యతలు స్వీకరించి కష్టపడి పని చేస్తున్న ఆ బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ బాలుడు ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడుతున్నారు. వీలైనంత త్వరగా ఆ బాలుడి తండ్రి కోలుకోవాలని కోరుకుంటున్నారు.





Updated Date - 2022-08-04T00:14:37+05:30 IST