కర్ణాటకలో నవంబర్ 8 నుంచి ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-06T01:42:37+05:30 IST

కర్ణాటకలో నవంబర్ 8 నుంచి ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల ప్రారంభం

కర్ణాటకలో నవంబర్ 8 నుంచి ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల ప్రారంభం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంస్థలన్నింటినీ పునఃప్రారంభించింది. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలను తెరవాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు అనుగుణంగానే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ఈనెల 8 నుంచి ప్రారంభించనున్నట్లు ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఆరోగ్య విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రుల అంగీకార పత్రం అందచేయాల్సి ఉంటుందని, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 50 ఏళ్లు పైబడిన వారు ఫేస్‌షీల్డు వేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు ప్రారంభమై సాధారణంగా కొనసాగుతున్నందున ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభించాలని నిర్ణయించారు.

Updated Date - 2021-11-06T01:42:37+05:30 IST