8 ఏళ్లలో 8 రెట్ల వృద్ధి: మోదీ

ABN , First Publish Date - 2022-06-10T09:18:57+05:30 IST

దేశాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రతి రంగాన్ని బలోపేతం చేయాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు.

8 ఏళ్లలో 8 రెట్ల వృద్ధి: మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 9: దేశాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రతి రంగాన్ని బలోపేతం చేయాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. కొన్ని రంగాలపైనే దృష్టిసారించి ఇతర రంగాలను విస్మరించే మునుపటి విధానాన్ని మార్చివేసినట్టు తెలిపారు. రెండు రోజులు జరిగే బయోటెక్‌ స్టార్టప్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన  సందర్భంగా మోదీ ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో దేశ ‘బయో-ఎకానమీ’ 8 రెట్లు వృద్ధి చెంది 1,000 కోట్ల డాలర్ల నుంచి 8,000 కోట్ల డాలర్ల (6.22 లక్షల కోట్లు)కు చేరిందన్నారు. ప్రపంచ బయోటెక్‌ ఎకోసిస్టమ్‌లోని టాప్‌ 10 దేశాల్లో చేరేందుకు దేశం ఎంతో దూరంలో లేదని చెప్పారు. దేశంలోని స్టార్ట్‌పల సంఖ్య కొన్ని వందల స్థాయి నుంచి 70,000కు పెరిగినట్టు తెలిపారు. వైవిధ్యమైన జనాభా, శీతోష్ణస్థితి మండలాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నాలు పెరగడం, బయో ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండటం వల్ల బయోటెక్‌రంగంలో భారత్‌ అవకాశాల గనిగా మారిందన్నారు. 

Updated Date - 2022-06-10T09:18:57+05:30 IST