తల్లి ఆత్మహత్య.. 3 రోజుల తర్వాత వెలుగులోకి 8 ఏళ్ల కూతురి లేఖ.. అందులో ఏం రాసిందో చదివి..

Published: Sat, 02 Apr 2022 19:39:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లి ఆత్మహత్య.. 3 రోజుల తర్వాత వెలుగులోకి 8 ఏళ్ల కూతురి లేఖ.. అందులో ఏం రాసిందో చదివి..

ఆమె ఓ ప్రముఖ వైద్యురాలు.. వైద్య రంగంలో మంచి అనుభవంతో పాటూ గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఎంతో మంది రోగులకు మెరుగైన వైద్యం అందించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ రోజు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులతో పాటూ ప్రజలంతా షాక్ అయ్యారు. అనంతరం మూడు రోజుల తర్వాత ఆమె 8ఏళ్ల కూతురు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ చదివి అంతా అయ్యో! పాపం.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే...

తల్లి ఆత్మహత్య.. 3 రోజుల తర్వాత వెలుగులోకి 8 ఏళ్ల కూతురి లేఖ.. అందులో ఏం రాసిందో చదివి..

రాజస్థాన్ రాష్ట్రం దౌసా ప్రాంతంలో డాక్టర్ అర్చన శర్మకు భర్త సునీత్ ఉపాధ్యాయ, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. గైనకాలజిస్ట్ అయిన అర్చన గుజరాత్‌లోని మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. అలాగే వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ గోల్డ్ మెడల్ అందుకున్నారు. అర్చన దంపతులు దౌసాలోని లాల్సోట్‌లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆశా బైర్వా అనే గర్భిణి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గర్భిణి మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ మృతదేహంతో తిరిగి ఆస్పత్రి వద్దకు చ్చారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందంటూ.. కొంతమంది బీజేపీ నాయకులతో కలిసి ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అందరితో మాట్లాడారు. వైద్యురాలిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో కలత చెందిన అర్చన శర్మ.. మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేనేమీ తప్పు చేయలేదు, ఎవరినీ చంపలేదు, బహుశా మరణంతోనైనా నేను నిర్దోషినని తెలుస్తుంది’’ అంటూ సూసైడ్ నోట్ రాసింది.

అబ్బాయి అస్సలు బాగాలేడంటూ పెళ్లిని రద్దు చేసుకున్న 18 ఏళ్ల యువతి.. 13 ఏళ్ల క్రితం తండ్రి చేసిన పనికి..

ఈ క్రమంలో జైపూర్‌లో ఉన్న వైద్యురాలు అర్చన 8ఏళ్ల కుమార్తె శాంభవి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో.. ‘‘ఈ ప్రపంచంలో అత్యంత మధురమైన తల్లి నా తల్లి.. ఆమె నాకు ఒక వరం. అమ్మ లేకపోవటం వెళితిగా ఉంది. నేను ఏడవను, ఎందుకంటే నేను ఏడవడం ప్రారంభిస్తే అందరూ ఏడవడం ప్రారంభిస్తారు’’.. అంటూ రాసుకొచ్చింది. ఈ లేఖ చదవగానే బాలిక తండ్రితో పాటూ సన్నిహితులంతా బోరున విలపించారు. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ అవడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌లోని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. వారంలో శనివారం వైద్య సేవలను నిలిపివేస్తూ ఆందోళన చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి ఈ కేసులో బీజేపీ రాష్ట్ర మంత్రి జితేంద్ర గోత్వాల్‌తో పాటు ఒక కార్యకర్తను గురువారం అరెస్టు చేశారు.

ఇద్దరు భార్యలనూ ఒకే ఇంట్లో వుంచాడు.. రాత్రి ఎవరితో ఉండాలనే విషయంలో గొడవ.. చివరికి మొదటి భార్యపై..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

భార్య అలా చేస్తే.. భర్తకు భరణం ఇవ్వాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పుమేకల అరుపులు విని అటుగా వెళ్లిన స్థానికులు.. కడుపుతో ఉన్న మేకను పట్టుకుని ముగ్గురు కలిసి చేస్తున్న పని చూసి షాక్.. చివరకు..అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. యువతి బెడ్‌రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించగానే.. ఆమె ఇచ్చిన రియాక్షన్..ప్రియుడు పిలవడంతో డిన్నర్‍‍‌కు వెళ్లిన యువతి.. అనంతరం రాత్రి అతడి గదికి వెళ్లగా.. లోపల ఊహించని విధంగా.. ఛీ! వీడసలు మనిషేనా.. ప్రాణంగా చూసుకోవాల్సిన భార్యను.. సోదరుడు, బాలుడితో కలిసి పొలాల్లోకి తీసుకెళ్లి.. ఇంకోసారి అతన్ని కలవొద్దంటూ కూతురికి సూచించిన తల్లి.. ఓ రోజు తల్లి పడుకుని ఉండగా.. ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిచి...
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.