13 ఏళ్ల దళిత బాలికకు 80మంది నరకం

ABN , First Publish Date - 2022-04-21T07:29:45+05:30 IST

దళిత బాలికను వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వ్యభిచారం చేయించిన ఘటన అప్పట్లో ఎంత కలకలం రేపిందో.. ఆ కేసును పోలీసులు ఛేదిస్తున్న విధానమూ అంతే సంచలనంగా మారింది. బంగారం, బాండ్లు, ప్రా మిసరీ నోట్లు సైతం చేతులు మారి..

13 ఏళ్ల దళిత బాలికకు 80మంది నరకం

రెండు రాష్ట్రాల్లో రెండు నెలలు తిప్పుతూ అత్యాచారం

ఇప్పటిదాకా 74 మంది అరెస్టు...

బాలికపై అమానుషంగా బేరసారాలు 


గుంటూరు, ఏప్రిల్‌ 20: దళిత బాలికను వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వ్యభిచారం చేయించిన ఘటన అప్పట్లో ఎంత కలకలం రేపిందో.. ఆ కేసును పోలీసులు ఛేదిస్తున్న విధానమూ అంతే సంచలనంగా మారింది. బంగారం, బాండ్లు, ప్రా మిసరీ నోట్లు సైతం చేతులు మారి.. రెండు రా ష్ట్రాల్లో అల్లుకున్న కేసు ఇది. 80మందిని నిందితులుగా తేల్చి ఇప్పటివరకు 74మందిని ఈ కేసులో గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల పిల్లలు నిందితులుగా ఉన్నారు. మొత్తం దందాను ఓ మహిళా హోంగ ార్డు, ఆమె కుమార్తె బెజవాడ కేంద్రంగా నడిపించినట్టు తేలడం దిగ్ర్భాంతికర అంశం. లండన్‌లో ఉంటున్న మరో నిందితుడికి రెడ్‌కార్నర్‌ నోటీసు లు జారీ అయ్యాయి.  గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచా ర నిర్వాహకుల ముఠా వ్యభిచార రొంపిలోకి దిం చింది. బాలికను నిర్వాహకులు ఒకరి తర్వాత ఒక రు కొనుగోలు చేస్తూ వివిధ ప్రాంతాలకు తిప్పి వ్యభిచారం చేయించారు. విజయవాడ, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్‌లలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిలో విజయవాడలోని ఇబ్రహీంపట్నం కు చెందిన మహిళా హోంగార్డు జెసింత, ఆమె కుమార్తె హేమలత ముఖ్య పాత్ర పోషించారు. 


ఆస్పత్రి నుంచి అపహరించి..

పోలీసుల కథనం ప్రకారం.. జెసింత మహిళా నాయకురాలిగా, పోలీ్‌సస్టేషన్లలో పంచాయితీలు చేస్తూ తనకు పరిచయమైన వారిలో నిస్సహాయులను ట్రాప్‌ చేస్తుంది. ఈ వ్యవహారంలో హేమలత తల్లికి సహకరిస్తోంది. ట్రాప్‌ చేసినవారిని తల్లీకుమార్తె గుంటుపల్లిలో(విజయవాడ) అద్దెకు తీసుకున్న ఇంటిలో ఉంచి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సవర్ణకుమారి అనే వ్యభిచార గృహ నిర్వాహకులి ద్వా రా బాధితురాలు జెసింత చేతుల్లో పడింది. కొవిడ్‌బారినపడిన దళిత బాలిక తల్లిని ఆమె తండ్రి గత ఏడాది జూన్‌లో గుంటూరు ప్రభుత్వాస్పత్రి లో చేర్చారు. అక్కడ బాధితురాలిని చూసి సవర్ణకుమారి స్నేహం పెంచుకుంది. చికిత్స పొందు తూ ఆ ఆస్పత్రిలో బాధితురాలి తల్లి చనిపోయిం ది. ఆస్పత్రిలో ఉన్న తండ్రికి చెప్పకుండా బాధితురాలిని సవర్ణకుమారి తీసుకెళ్లిపోయింది. రెండునెలలపాటు అనేక ప్రాంతాలకు బాధితురాలిని తి ప్పుతూ వ్యభిచారం చేయించింది. ఈ క్రమంలోనే జెసింత వద్దకు బాలిక చేరింది. ఇక్కడ ఉండగానే ఆ కూపం నుంచి ఎలాగోలా బయటపడి గత ఏడాది ఆగస్టులో పోలీసులను కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది.


ఈ కేసులో ఈ ఏడాది జనవరిలో తొలి అరెస్టు జరిగింది. మంగళవారం ఒక్కరోజే బీటెక్‌ విద్యార్థి సహా పదిమందిని అరె స్టు చేశారు. ఈ వివరాలను గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి కారు, మూడు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు, 49 సెల్‌ఫోన్లు, బంగారం, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మహిళా హోంగార్డు జెసింత కూతురు కూడా ఇ దే వృత్తిలో ఉందని.. వారు ఈ కేసులో 110 రోజు లు రిమాండ్‌లో ఉన్నారన్నారు. జైలు నుంచి వ చ్చిన తర్వాత తాజా, మాజీ విటులను కలిసి తల్లీకుమార్తె బెదిరింపులకు పాల్పడ్డారని, ‘‘మీ పేర్లు పోలీసులకు చెప్పకుండా ఉండాలంటే రూ.50 వేలు తేవాలి’’ అని బెదరగొట్టారన్నారు. 

Updated Date - 2022-04-21T07:29:45+05:30 IST