గాయపడిన కన్నడిగులు
పాములపాడు, మార్చి 27: శ్రీశైలానికి పాద యాత్రగా వెళ్తున్న కన్నడ భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఆదివారం పాములపాడు చెలిమిళ్ల గ్రామాల మధ్యలో గల ఎస్ఆర్ఎంసీలో స్నానాలు చేసేందుకు దిగారు. వీరిలో ఒకరు తేనెతుట్టలపై రాయి విసిరారు. దీంతో తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా ఇటిగి గ్రామానికి చెందిన రవి, బాబు అలీకర్, జగ్గు పెరాయర్, సురేష్రాయి సహా 80 మందికి గాయాలయ్యాయి. వీరికి పాములపాడులోని వైద్యశాలలో చికిత్స అందించారు.