రూపాయి 82 దిగువకు

ABN , First Publish Date - 2022-10-07T09:17:25+05:30 IST

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. డాలర్‌ విశేషంగా పుంజుకోవడం, క్రూడాయిల్‌ ధరలు మరోసారి పెరుగుతూ ఉండడం రూపాయి చారిత్రక పతనానికి దారి తీశాయి.

రూపాయి 82 దిగువకు

55 పైసలు నష్టం

ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. డాలర్‌ విశేషంగా పుంజుకోవడం, క్రూడాయిల్‌ ధరలు మరోసారి పెరుగుతూ ఉండడం రూపాయి చారిత్రక పతనానికి దారి తీశాయి. గురువారం డాలర్‌ మారకంలో రూపాయి 82.17 వద్ద ముగిసింది. రూపాయి 82 కన్నా పైన ముగియడం ఇదే ప్రథమం. ఒపెక్‌ దేశాలు రోజువారీ చమురు ఉత్పత్తిని 20 లక్షల బ్యారెళ్ల మేరకు తగ్గించాలని నిర్ణయించడం రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసింది. గురువారం ఉదయం 81.52 వద్ద సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ త్రికూల వార్తల ప్రభావం వల్ల రూపాయి క్రమంగా దిగజారుతూ ఇంట్రాడేలో  చారిత్రక కనిష్ఠ స్థాయి 82.17కి దిగజారింది. ఆ తర్వాత కోలుకునే అవకాశం రాకపోవడంతో చివరికి మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 55 పైసల నష్టంతో అదే స్థాయిలో ముగిసింది. ఇదిలా ఉండగా  దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ 156.63 పాయింట్ల లాభంతో 58222.10 వద్ద, నిఫ్టీ 57.50 పాయింట్ల లాభంతో 17,331.80 వద్ద ముగిశాయి.

Updated Date - 2022-10-07T09:17:25+05:30 IST