కరోనాను జయించిన 82 ఏళ్ల వృద్ధురాలు.. మానసిక స్థైర్యంతోనే..

ABN , First Publish Date - 2020-08-08T17:07:21+05:30 IST

కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు. కొన్నిచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అటువంటిది 82 ఏళ్ల

కరోనాను జయించిన 82 ఏళ్ల వృద్ధురాలు.. మానసిక స్థైర్యంతోనే..

మానసిక స్థైర్యంతో చికిత్స పొందితే సత్వరమే కోలుకోవచ్చని భరోసా


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు. కొన్నిచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అటువంటిది 82 ఏళ్ల వయసులో కరోనా బారిన పడిన వృద్ధురాలు, ఆస్పత్రిలో చికిత్స పొంది, వైరస్‌పై విజయం సాధించారు. నగరంలోని  సీతమ్మధార ప్రాంతానికి చెందిన పి.సూర్యమణి(82 ఏళ్లు) గత నెల 29న కరోనా వైరస్‌ బారినపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజుల చికిత్స అనంతరం వైరస్‌ నుంచి కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా వైరస్‌ బారిన పడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని, మానసిక స్థైర్యంతో చికిత్స పొందితే సత్వరమే కోలుకోవచ్చని అన్నారు. కాగా ఆమె భర్త పి.రామారావు(83) కూడా అంతకు ముందే వైరస్‌ బారినపడ్డారు. ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లోనే వుండి వైద్యుల సలహా మేరకు మందులు వాడడంతో  కోలుకున్నారు. ఎనిమిది పదుల వయసులో కరోనాపై విజయం సాధించి వృద్ధ దంపతులు...  పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Updated Date - 2020-08-08T17:07:21+05:30 IST