ఫోన్ నెంబర్లు మార్చి మరీ 12 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా.. బాంబు పేల్చిన 84 ఏళ్ల వృద్ధుడు..

ABN , First Publish Date - 2022-01-05T17:42:41+05:30 IST

అతని పేరు బ్రహ్మదేవ్ మండల్.. వయసు 84 సంవత్సరాలు.. సంవత్సర కాలంలో అతను ఏకంగా 12 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు..

ఫోన్ నెంబర్లు మార్చి మరీ 12 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా.. బాంబు పేల్చిన 84 ఏళ్ల వృద్ధుడు..

అతని పేరు బ్రహ్మదేవ్ మండల్.. వయసు 84 సంవత్సరాలు.. సంవత్సర కాలంలో అతను ఏకంగా 12 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు.. మొబైల్ నెంబర్లు మార్చి ఏకంగా 12 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు.. ఎక్కువ సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం బాగుందని, అంతకుముందున్న చాలా నొప్పులు దూరమయ్యాయని బ్రహ్మదేవ్ చెప్పాడు. ఈ విషయం వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. 


వ్యాక్సిన్ కోసం పీహెచ్‌సీలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లకు వెళ్లినపుడు ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ అడుగుతుంటారు. అయితే వెంటనే కంప్యూటర్‌లో ఫీడ్ చేసుకోరు. తర్వాత కంప్యూటర్‌లో ఫీడ్ చేసేటపుడు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ అవుతుంది. సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకున్నట్టు రిజిస్టర్ కాదు. దానిని ఉపయోగించుకుని బీహార్‌లోని మాధేపురకు చెందిన బ్రహ్మదేవ్ అన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకోగలిగాడు. మొబైల్ నెంబర్లను మార్చి మార్చి చెప్పేవాడు. 


గత ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన బ్రహ్మదేవ్ తొలి వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఆ తర్వాత నెలకు ఒకసారి చొప్పున ఇప్పటివరకు 12 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఏయే తేదీల్లో వ్యాక్సిన్ వేయించుకున్నాడనేది డైరీలో రాసి పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని అతనే బయటపెట్టాడు. ఎక్కువ సార్లు వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పాడు. ఈ విషయం స్థానిక మెడికల్ ఆఫీసర్ వరకు వెళ్లింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. 

Updated Date - 2022-01-05T17:42:41+05:30 IST